News March 21, 2024

NGKL: కన్న కొడుకును హత్య చేసిన తల్లి

image

ఓ తల్లి కొడుకుని హత్య చేసిన ఘటన బిజినపల్లి మండలం అల్లిపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కొడుకు హరీశ్(11)ను గురువారం ఇంట్లో భర్త లేని సమయంలో రోకలి బండతో కొట్టి చంపేసింది. తర్వాత బుట్టలో చుట్టి, నీటి తొట్టిలో పడేసి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News September 16, 2025

MBNR: SP సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ

image

MBNRలోని పోలీసు కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో ఈ రోజు నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్పీ డి.జానకి అధికారులకు కీలక సూచనలు చేశారు.
✒CC కెమెరాల నిఘా పెంచి, పని చేయని కెమెరాలను వెంటనే రిపేర్ చేయాలి.
✒పెండింగ్‌లో ఉన్న అరెస్టులు, FSL రిపోర్టులు పూర్తి చేయాలి.
✒ప్రజావాణి.. వెంటనే చర్యలు తీసుకోవాలి.
✒POCSO కేసుల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలి.
✒వ్యవస్థీకృత నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

News September 16, 2025

MBNR: ఇంజినీరింగ్ కాలేజ్ HoDగా డా.రామరాజు

image

పాలమూరు యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజ్ HoDగా డాక్టర్ పండుగ రామరాజు నియామకమయ్యారు. ఈ మేరకు యూనివర్సిటీ ఉపకులపతి(VC) ప్రొ.జిఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.రమేష్ బాబు డాక్టర్ పండుగ రామరాజుకు నియమక పత్రం అందజేశారు. డాక్టర్ పండుగ రామరాజు ఉస్మానియా యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ, బిట్స్ పిలానీలో పీహెచ్డీ, ఐఐటి మద్రాస్‌లో పోస్ట్ డాక్టోరల్ ఫెలోగా పనిచేశారు. డా.ఎన్.చంద్ర కిరణ్ పాల్గొన్నారు.

News September 16, 2025

నేరస్థుల శిక్షల శాతం పెంచాలి: ఎస్పీ

image

వ్యవస్థీకృత నేరాలపై దృష్టి సారించి ప్రతి కేసును పారదర్శకంగా లోతైన విచారణతో ముందుకు తీసుకెళ్లాలని, తద్వారా నిందితులకు శిక్షలు పడే శాతాన్ని పెంచాలని మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ జానకి అన్నారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో నెలవారి నేరసమీక్ష సమావేశంలో ఎస్పీ పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఫోక్సో తదితర కేసుల విషయంలో అధికారులకు ఎస్పీ పలు సూచనలు సలహాలను అందించారు.