News February 8, 2025
NGKL: కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన మంత్రి జూపల్లి

ఆర్థిక అవరోధాలు ఉన్నా ప్రతి ఇంటా సౌభాగ్యాన్ని నింపాలనే మహాసంకల్పంతో రూపొందించిన అభయహస్తం హమీలన్నీ తూచ తప్పకుండా అమలు చేస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం కొల్లాపూర్ మండల రెవెన్యూ కార్యాలయంలో వీపనగండ్ల, మండలానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News November 27, 2025
బాలానగర్లో 13.5°C.. పెరిగిన చలి తీవ్రత

మహబూబ్నగర్ జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో జిల్లాలోనే అత్యల్పంగా బాలానగర్లో 13.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాజాపూర్లో 13.8°C, దోనూరులో 13.9°C నమోదయ్యింది. తీవ్రమైన చలి కారణంగా వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు.
News November 27, 2025
దుగ్గిరాల యార్డులో క్వింటాల్ పసుపు ఎంతంటే.!

దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం నిర్వహించిన వేలంలో పసుపు ధరలు నిలకడగా ఉన్నాయి. క్వింటాల్ పసుపు గరిష్ఠంగా రూ. 12,700 ధర పలికింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పసుపు కొమ్ముల ధర రూ. 9 వేల నుంచి రూ. 12,700 వరకు, కాయ రకం పసుపు ధర రూ. 9,300 నుంచి రూ. 12,190 వరకు పలికాయి. మార్కెట్లో మొత్తం మీద పసుపు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
News November 27, 2025
అమరావతి రైతులు ఆందోళన వద్దు: పెమ్మసాని

రాజధాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. త్రీ మ్యాన్ కమిటీ సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. అమరావతి సమస్యలకు పరిష్కారం చూపుతూనే, రాజధాని పనులు వేగవంతంగా పూర్తి చేస్తామన్నారు. రాబోయే 6 నెలల్లో రాజధానికి అవసరమైన మౌలిక సదుపాయాలను పూర్తిచేసే దిశగా పటిష్ఠ చర్యలు తీసుకుంటామన్నారు. మరో 4 రోజుల్లో జరగబోయే 2వ సమావేశంలో రైతులకు పూర్తి వివరాలు చెప్తామన్నారు.


