News January 29, 2025
NGKL: కార్యాచరణ ప్రకటించిన జిల్లా జేఏసీ నేతలు

నాగర్ కర్నూల్ జిల్లా వివిధ మండలాలలో పనిచేస్తున్న ఉపాధి హామీ ఉద్యోగులు రాష్ట్ర జేఏసీ నిర్ణయం మేరకు రేపటినుంచి నిరసన కార్యక్రమాలు చేపడతామని జిల్లా జేఏసీ ఛైర్మన్ నల్లగంటి బాలయ్య తెలిపారు. ప్రతి మండలంలో ఉపాధి హామీ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టాలని తెలిపారు. ఆనంద్ కుమార్, భాస్కర్, క్రాంతి కుమార్, రాజేష్ కుమార్ బాలకృష్ణ, రవిరాజ్, జీవన్ ప్రకాష్,ఆసిఫ్, నారాయణ తెలిపారు.
Similar News
News December 24, 2025
12-3-30 వర్కౌట్ గురించి తెలుసా?

12-3-30 వర్కౌట్లో రన్నింగ్, పెద్ద పెద్ద బరువులు ఎత్తకుండానే బాడీని ఫిట్గా ఉంచుకోవచ్చని ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ట్రెడ్మిల్ను 12% వాలుగా ఉండేలా సెట్ చేసుకోవాలి. గంటకు 3మైళ్ల వేగంతో 30నిమిషాలు ఆగకుండా నడవాలి. దీంతో శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ మెరుగుపడి, కండరాల్లో పటుత్వం పెరుగుతుంది. కొవ్వు కరగడం మొదలవుతుంది. పరిగెత్తడంతో పోలిస్తే 12-3-30 వర్కౌట్తో కొవ్వును వేగంగా కరిగించుకోవచ్చు.
News December 24, 2025
బంగ్లాదేశ్ దౌత్యవేత్తకు మరోసారి భారత్ సమన్లు

భారత్-బంగ్లా సంబంధాలు మరింత బలహీనమవుతున్నాయి. బంగ్లాలోని భారత దౌత్యవేత్తకు ఆ దేశం సమన్లు జారీ చేసిన గంటల వ్యవధిలోనే భారత్లోని BAN దౌత్యవేత్త రియాజ్ హమీదుల్లాకు MEA సమన్లు ఇచ్చింది. వారం వ్యవధిలో ఇది రెండోది. నిన్న హమీదుల్లాను పిలిపించి హాదీ మరణానంతరం బంగ్లాలోని భారత హైకమిషనర్ల వద్ద జరుగుతున్న పరిణామాలపై చర్చించి ఆందోళన వ్యక్తం చేసింది. కాగా ఇప్పటికే ఇరుదేశాలు వీసా సర్వీసులను నిలిపేశాయి.
News December 24, 2025
డిసెంబర్ 24: చరిత్రలో ఈ రోజు

✒ 1924: లెజెండరీ సింగర్ మహ్మద్ రఫీ జననం(ఫొటోలో)
✒ 1956: నటుడు, నిర్మాత అనిల్ కపూర్ జననం
✒ 1987: తమిళనాడు మాజీ సీఎం, నటుడు ఎంజీ రామచంద్రన్ మరణం
✒ 2002: ఢిల్లీ మెట్రో రైల్వేను ప్రారంభించిన ప్రధాని వాజ్పేయి
✒ 2005: ప్రముఖ నటి భానుమతి మరణం
✒ జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం


