News January 29, 2025
NGKL: కార్యాచరణ ప్రకటించిన జిల్లా జేఏసీ నేతలు

నాగర్ కర్నూల్ జిల్లా వివిధ మండలాలలో పనిచేస్తున్న ఉపాధి హామీ ఉద్యోగులు రాష్ట్ర జేఏసీ నిర్ణయం మేరకు రేపటినుంచి నిరసన కార్యక్రమాలు చేపడతామని జిల్లా జేఏసీ ఛైర్మన్ నల్లగంటి బాలయ్య తెలిపారు. ప్రతి మండలంలో ఉపాధి హామీ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టాలని తెలిపారు. ఆనంద్ కుమార్, భాస్కర్, క్రాంతి కుమార్, రాజేష్ కుమార్ బాలకృష్ణ, రవిరాజ్, జీవన్ ప్రకాష్,ఆసిఫ్, నారాయణ తెలిపారు.
Similar News
News February 19, 2025
WGL: ‘స్మార్ట్ సిటీ పనులను నిర్దిష్ట గడువులోపు పూర్తి చేయాలి’

స్మార్ట్ సిటీ పనులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. జీడబ్ల్యూసీ పరిధిలోస్మార్ట్ సిటీ పథకం కింద కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. టీచర్స్ కాలనీ ఫేజ్-1లో సీసీ రోడ్‌ను, వడ్డేపల్లి బండ్‌పై కొనసాగుతున్న అభివృద్ధి పనులు, 52వ డివిజన్ రాజాజీ నగర్ కల్వర్టు ఇతర పనులను పరిశీలించారు.
News February 19, 2025
పెద్దగట్టుకు ఘాట్ రోడ్డు, గెస్ట్ హౌస్: కోమటిరెడ్డి

రూ.60 కోట్లతో పెద్దగట్టుకు ఘాట్ రోడ్డు, గెస్ట్ హౌస్ నిర్మిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. జాతరలో పాల్గొని స్వామి వారి దర్శనం అనంతరం మాట్లాడారు. సాధారణ సమయంలోనూ వేలాదిగా భక్తులు తరలివచ్చే మహిమాన్విత జాతర పెద్దగట్టు అన్నారు. వచ్చే జాతరలోపు భక్తులు ఇబ్బందులు పడకుండా బాత్‌రూమ్‌లు, ఇతర సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
News February 19, 2025
బ్యాక్టీరియా లేదు.. ఆ నీటిని తాగొచ్చు: యోగి

UP ప్రయాగ్ రాజ్ త్రివేణీ సంగమంలో బ్యాక్టీరియా ఉందన్న వార్తలను సీఎం యోగి ఆదిత్యనాథ్ కొట్టిపారేశారు. గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే ఆ చోటు పవిత్రమైందని.. ఆ నీళ్లను తాగొచ్చని చెప్పారు. సనాతన ధర్మం, గంగామాతపై ఫేక్ వీడియోలు వైరల్ చేస్తున్నారని ఫైరయ్యారు. కాగా జనవరి 12, 13 తేదీల్లో మహాకుంభమేళా నీటిని పరిశీలించిన CPCB.. అందులో బ్యాక్టీరియా ఉందని, స్నానానికి పనికిరావని NGTకి నివేదిక ఇచ్చింది.