News February 14, 2025
NGKL: కురుమూర్తి స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు

చిన్నచింతకుంట మండలం అమ్మపూర్ గ్రామంలో స్వయంభూ శ్రీకురుమూర్తి స్వామినీ గురువారం నాగర్‌కర్నూల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కూచుకుళ్ల సరిత రాజేష్ రెడ్డి దంపతులు దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఆలయ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రమణారావు, ఆలయ ఛైర్మన్ గోవర్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 18, 2025
నల్గొండ: పనుల ప్రారంభం వేగవంతం చేయాలి: కలెక్టర్

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలతో నల్గొండ బైపాస్ జాతీయ రహదారి 565కు సంబంధించి అవార్డు పాస్ చేయడం, పనుల ప్రారంభం వంటివి వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మంగళవారం ఆమె తన ఛాంబర్‌లో నేషనల్ హైవే 565 నల్గొండ బైపాస్‌పై జాతీయ రహదారుల సంస్థ అధికారులు ,ఆర్ అండ్ బీ అధికారులతో సమావేశం అయ్యారు.
News March 18, 2025
NTR: ఆర్‌వోఎఫ్ఆర్ పట్టాలపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

అర్హులైన వారికి ఇబ్బంది లేకుండా ఆర్‌వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీకి అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో అటవీ శాఖ సమీక్షా సమావేశం జరిగింది. ఆర్‌వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీ, హరిత విస్తీర్ణం పెంపు, ఆక్రమణల నియంత్రణ తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యక్రమాలు పకడ్బందీగా అమలయ్యేలా చూడాలన్నారు.
News March 18, 2025
చిత్తూరులో భారీగా పోలీసుల బదిలీ

చిత్తూరు జిల్లా పరిధిలోని పోలీసు శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. పోలీస్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ మణికంఠ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 219 మంది సిబ్బందిని వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేయగా.. మరికొందరిని వీఆర్‌కు పంపించారు. పుంగనూరులో టీడీపీ నాయకుడి హత్య నేపథ్యంలోనే భారీ స్థాయిలో పోలీసులను బదిలీ చేసినట్లు సమాచారం.