News October 29, 2024

NGKL: కులగణన పరదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్

image

కులగణన సర్వేను పారదర్శకంగా నిర్వహించేందుకు సంసిద్ధంగా ఉండాలని NGKL జిల్లాకలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ లో సంబంధిత అధికారులతో కలెక్టర్ ముందస్తు సమావేశం నిర్వహించారు. ఇంటింటి సర్వే ప్రారంభించే దిశగా సమర్థవంతమైన ప్రణాళికల రూపొందించాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తతో కులగణన సర్వేను పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.

Similar News

News February 24, 2026

జడ్చర్ల: భార్యభర్తల గొడ.. కత్తితో దాడి

image

భార్య, భర్త గొడవపడి ఇద్దరి అత్తలపై కత్తితో దాడి చేసిన ఘటన జడ్చర్ల మండలం పోలేపల్లిలో జరిగింది. సోమవారం రాత్రి పోలేపల్లికి చెందిన అలివేలు, రవి దంపతులు గొడవపడ్డారు. గొడవ ఆపేందుకు వచ్చిన అత్తలు శ్యామలమ్మ, అంజమ్మలపై రవి కత్తి మొఖం, కడుపులో దాడి చేయగా వారికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 సిబ్బంది ప్రథమ చికిత్స తర్వాత జిల్లా ఆసుపత్రికి తరలించారు.

News February 23, 2026

MBNR: పీఎం శ్రీ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

image

పీఎం శ్రీ పాఠశాలల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. సెంట్రల్ అబ్జర్వర్ ఫరీదా మహమ్మద్ బాలానగర్, రాజాపూర్ పాఠశాలలను తనిఖీ చేసి నిధుల వినియోగాన్ని పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమీక్షలో పనుల నాణ్యత, గడువుపై కలెక్టర్ అధికారులకు కీలక సూచనలు చేశారు.

News February 23, 2026

పాలమూరు: మత్తు వదలండి.. మైదానాలు చేరండి: మంత్రి

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్‌లో నాలుగు రోజుల పాటు జరిగిన సెకండ్ ఎడిషన్ సీఎం కప్ కబడ్డీ ఛాంపియన్ షిప్ పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ వేడుకలకు మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రపంచాన్ని వదిలి క్రీడలపై ధ్యాస పెడితే ప్రపంచం మొత్తం తమ వైపు చూస్తుందన్నారు. 33 జిల్లాల నుంచి సుమారు 1,200 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.