News January 25, 2025
NGKL: కుష్ఠు వ్యాధి అవగాహన అవసరం: స్వరాజ్యలక్ష్మి

స్పర్శలేని కుష్ఠి వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి స్వరాజ్యలక్ష్మి అన్నారు. జిల్లా కలెక్టర్ సమావేశ హాల్లో వైద్యాధికారులు, కుష్ఠు వ్యాధి నోడల్ అధికారులు ఈనెల 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు స్పర్శ లేని కుష్ఠు వ్యాధిపై అవగాహన ఉద్యమం నిర్వహించాలని సూచించారు. ప్రజలు ఈ వ్యాధి (స్పర్శ లేని మచ్చ)పై అవగాహనతో వారే స్వయంగా డాక్టర్ను సంప్రదించాలన్నారు.
Similar News
News November 28, 2025
కాశీకి వెళ్లలేకపోయినా.. ఈ శివాలయాలకు వెళ్లవచ్చు

మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా కాశీ వెళ్లి తీరాలని మన శాస్త్రాలు చెబుతాయి. అయితే కాశీ వెళ్లడం సాధ్యం కానప్పుడు నిరాశ చెందాల్సిన అవసరం లేదని పండితులు అంటున్నారు. కాశీతో సమానమైన శక్తి ఉన్న 4 కాశీ క్షేత్రాలు ఉన్నాయంటున్నారు. వీటిలో ఏ క్షేత్రాన్ని దర్శించినా కాశీ యాత్ర ఫలం లభిస్తుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. 1. కేదార క్షేత్రం 2. శ్రీశైలం 3. శ్రీకాళహస్తి 4. పట్టిసము (పట్టిసీమ).
News November 28, 2025
VKB: నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ కండక్టర్

వికారాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో చేవెళ్ల-శంకర్పల్లి రూట్లో ఒక ప్రయాణికురాలు తన బ్యాగును మర్చిపోయింది. అందులో సుమారు రూ.2 లక్షల నగదు ఉంది. ఈ బ్యాగును గుర్తించిన కండక్టర్ మీనా, వెంటనే పోగొట్టుకున్న మహిళకు డబ్బును తిరిగి ఇచ్చారు. కండక్టర్ మీనా నిజాయితీని పలువురు ప్రశంసించారు.
News November 28, 2025
నేడే రాజధానిలో 15 బ్యాంకులకు శంకుస్థాపన

AP: రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు పడనుంది. దేశంలోని 15 ప్రముఖ బ్యాంకులు, బీమా సంస్థలు రాజధానిలో తమ ఆఫీసులు ఏర్పాటు చేసుకుంటున్నాయి. వీటికి ఈ ఉదయం 11.22గంటలకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, CM CBN చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. రూ.1,334 కోట్లతో నిర్మాణాలు చేపట్టనున్నారు. ఆయా బ్యాంకులు, బీమా సంస్థల ప్రతినిధులు, మంత్రులు, రాజధాని రైతులు హాజరుకానున్నారు.


