News February 3, 2025
NGKL: కేంద్ర బడ్జెట్‌పై నేడు కాంగ్రెస్ నిరనలు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ నిరసనకు పిలుపునిచ్చింది. స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు ధర్నా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే, జిల్లా డీసీసీ వంశీకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్, NSUI, జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని చెప్పారు.
Similar News
News February 3, 2025
అర్ధరాత్రి నుంచి ఆదిత్యుని క్షీరాభిషేకం
ప్రసిద్ధ సూర్య నారాయణ స్వామివారి రథసప్తమి వేడుకలు అరసవల్లిలో ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆదిత్యునికి క్షీరాభిషేకం చేస్తామని ఈవో వై.భద్ర తెలిపారు. అనంతరం ప్రత్యక దర్శనాలు కల్పిస్తారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్వామివారి నిజ రూప దర్శనానికి భక్తులను అనుమతిస్తారు.
News February 3, 2025
ముద్రగడకు YS జగన్ పరామర్శ
AP: వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డిని మాజీ సీఎం జగన్ ఫోన్లో పరామర్శించారు. నిన్న ఆయన నివాసంపై <<15338401>>దాడి<<>> జరిగిన ఘటన గురించి వివరాలు తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని అన్నారు. ఆయనకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నిన్న తెల్లవారుజామున మద్యం మత్తులో ఓ యువకుడు ముద్రగడ ఇంటిని ట్రాక్టర్‌తో ఢీకొట్టిన సంగతి తెలిసిందే.
News February 3, 2025
పారిశ్రామికవేత్తలకు మోదీ, కేజ్రీ బానిసలు: ప్రియాంక
ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్‌పై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ మండిపడ్డారు. ‘ఇద్దరిదీ ఒకే తరహా మైండ్‌సెట్. పారిశ్రామిక వేత్తలకు బానిసత్వం చేస్తుంటారు. వారిలాంటి పిరికిపందల్ని నేనెప్పుడూ చూడలేదు. అభివృద్ధి జరగకపోవడానికి నెహ్రూ కారణమని మోదీ ఆరోపిస్తుంటారు. అటు కేజ్రీవాల్ తన వైఫల్యాలకు మోదీ కారణమంటారు. ఆయన శీశ్‌మహల్ కడితే మోదీ రాజ్‌మహల్ కట్టారు’ అని విమర్శించారు.