News February 21, 2025

NGKL: గంజాయి సాగుపై ఉక్కు పాదం మోపండి: మంత్రి

image

జిల్లాలో గంజాయి, నాటు సారా రహిత జిల్లాగా మార్చేందుకు ఎక్సైజ్, పోలీస్ శాఖల అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని జిల్లా కలెక్టర్ బాడావత్ సంతోష్, జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఎమ్మెల్యేలు డాక్టర్ రాజేష్ రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.

Similar News

News January 9, 2026

పెరిగిన బంగారం ధరలు, తగ్గిన వెండి రేటు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు పెరగగా, వెండి రేట్లు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.710 పెరిగి రూ.1,38,710కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.650 పెరిగి రూ.1,27,150 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ ధర రూ.4వేలు తగ్గి రూ.2,68,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప మార్పులున్నాయి.

News January 9, 2026

శ్రీకాకుళం: ప్రభుత్వ న్యాయవాదిగా ఇప్పిలి తాత నియామకం

image

శ్రీకాకుళం జిల్లా కోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా ఇప్పిలి తాతను ప్రభుత్వం నియమించింది. గురువారం సాయంత్రం ఈ ఆదేశాలు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ పదవిలో తను మూడేళ్లు కొనసాగుతానని చెప్పారు. గతంలో ఈయన నరసన్నపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. పలువురు న్యాయవాదులు ఆయనను అభినందించారు.

News January 9, 2026

WGL: ‘ఎడిట్’తో నిలువు దోపిడీ..!

image

భూభారతి పోర్టల్‌లోని ‘ఎడిట్’ ఆప్షన్‌ను ఆసరాగా చేసుకుని ఓ కేటుగాడు భారీ మోసానికి తెరలేపాడు. యాదగిరిగుట్టకు చెందిన ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు రిజిస్ట్రేషన్ ఫీజుల రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.లక్షల సొమ్మును రూ.వందలకే మార్చి ఖజానాకు గండికొట్టాడు. ఈ ఘటన జనగామలో వెలుగు చూడగా, తహశీల్దార్ ఫిర్యాదుతో వరంగల్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.