News March 26, 2025

NGKL: గణితం పరీక్షకు 25 మంది గైర్హాజరు

image

నాగర్ కర్నూల్ జిల్లావ్యాప్తంగా బుధవారం 10వ తరగతి పరీక్షల్లో భాగంగా గణితం పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 10,560 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 10,535 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారని డీఈఓ రమేష్ కుమార్ పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అన్ని వసతులు కల్పించామని ఆయన పేర్కొన్నారు.

Similar News

News December 23, 2025

బాపట్ల: అలర్ట్.. షెడ్యూల్ విడుదల..!

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో 2026 జనవరి 20 నుంచి ఫిబ్రవరి 19 వరకు సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు CDE సమన్వయకర్త రామచంద్రన్ తెలిపారు. UG, PG 1, 2, 3, 4, 5 సెమిస్టర్ల పరీక్షల షెడ్యూల్ విడుదల చేశామన్నారు. పూర్తి స్థాయి షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీలోని సంబంధిత అధికారులను సంప్రదించాలన్నారు.

News December 23, 2025

ప్రపంచంతో పోటీ పడేలా సింగరేణి సంస్థను తీర్చిదిద్దుతున్నాం: DY.CM

image

ప్రపంచంతో పోటీ పడేలా సింగరేణి సంస్థను తీర్చిదిద్దుతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. మంగళవారం సత్తుపల్లిలో సింగరేణి కాలరీస్ కంపెనీ నూతన జీఎం కార్యాలయ భవనాన్ని సింగరేణి సంస్థ సీఎండీ కృష్ణ భాస్కర్ తో కలిసి ప్రారంభించారు. సింగరేణి సంస్థ నేడు 45 వేల శాశ్వత ఉద్యోగులు, 40 వేల కాంట్రాక్టు ఉద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించిందని భట్టి పేర్కొన్నారు.

News December 23, 2025

పేపర్ లెస్ పరిపాలన అందించాలి: డీఎంహెచ్‌వో

image

జిల్లా పరిధిలో ఈ-ఆఫీస్ డిజిటల్ సేవల ద్వారా పేపర్ లెస్ పరిపాలన అందించాలని డీఎంహెచ్‌వో డా.కృష్ణమూర్తి నాయక్ వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం, వేగవంతంగా సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ సాంకేతికతను పూర్తిగా అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో భౌతిక ఫైళ్లకు బదులుగా డిజిటల్ ఫైళ్లు నిర్వహించాలన్నారు.