News January 27, 2025
NGKL: గురుకుల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

బిజినెపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5 తరగతి ప్రదేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సుమతి ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఫిబ్రవరి 1 లోపు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని, 5వ తరగతితో పాటు 6, 7, 8, 9 తరగతిలో మిగిలి ఉన్న సీట్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రవేశ పరీక్షలు ఫిబ్రవరి 23న ఉంటుందని తెలిపారు.
Similar News
News November 23, 2025
KMR: అంతర్రాష్ట్ర ఫేక్ కరెన్సీ రాకెట్ పట్టివేత

కామారెడ్డి జిల్లా పోలీసులు అంతర్రాష్ట్ర నకిలీ కరెన్సీ రాకెట్‌ను పట్టుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1,70,500 ఫేక్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు SP రాజేశ్ చంద్ర తెలిపారు. నేరస్తులు చట్టం ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరని స్పష్టం చేశారు.
News November 23, 2025
నెల్లూరు నగర మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి గ్రీన్ సిగ్నల్!

నెల్లూరు నగర మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానానికి టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయంపై మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్పొరేషన్ పరిధిలోని కార్పొరేటర్లతో చర్చించారు. అవిశ్వాస తీర్మానం పెట్టాలన్న నిర్ణయంపై ఇరువురు నేతల అంగీకారం తెలిపారు. సోమవారం కార్పొరేటర్లందరూ కలెక్టర్‌ను కలిసి నోటీసు ఇవ్వనున్నారు.
News November 23, 2025
ఊట్కూర్: తెలంగాణ ఉద్యమ నాయకుడి మృతి

ఊట్కూర్ మండలంలోని పెద్దపోర్ల గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమ నాయకుడు, బీఆర్ఎస్ సీనియర్ నేత మాలే బాలప్ప (48) ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. వారం క్రితం బ్రెయిన్ స్ట్రోక్‌తో శస్త్రచికిత్స జరిగింది. అస్వస్థత గురై పరిస్థితి విషపించడంతో తుదిశ్వాస విడిచారు. 2001 మలిదశ ఉద్యమంలో రైలు రోకో, రాస్తారోకో, సకలజనుల సమ్మె వంటి కార్యక్రమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. పలువురు సంతాపం తెలిపారు.


