News February 2, 2025

NGKL: గురుకుల ప్రవేశాలకు మరో అవకాశం

image

గురుకులాల పాఠశాలల్లో ప్రవేశాలకు గడువు పొడిగించారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని NGKL జిల్లా అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 5 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తుకు శనివారంతో గడువు ముగియగా మరో 6 రోజులు పొడిగించారు. వరుస సెలవులు రావడం, పెద్ద సంఖ్యలో అప్లికేషన్లు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Similar News

News February 3, 2025

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 3, 2025

నెతన్యాహు సతీమణిపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్

image

ఇజ్రాయెల్ PM నెతన్యాహు సతీమణి సారాపై నేర విచారణ చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఆయనపై ఉన్న ఓ అవినీతి కేసులో సాక్షులను ఆమె బెదిరించారని మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు స్టేట్ అటార్నీ వెల్లడించింది. తనకు అనుకూలంగా వార్తలు రాసినందుకు కొన్ని మీడియా సంస్థలకు నెతన్యాహు డబ్బులు ఇచ్చారనేది ప్రధాన ఆరోపణ. మోసం, నమ్మకద్రోహం, అవినీతిపై విచారణ జరుగుతోంది.

News February 3, 2025

NGKL: కేంద్ర బడ్జెట్‌పై నేడు కాంగ్రెస్ నిరనలు

image

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ నిరసనకు పిలుపునిచ్చింది. స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు ధర్నా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే, జిల్లా డీసీసీ వంశీకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్, NSUI, జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని చెప్పారు.