News February 5, 2025

NGKL: ఘోర రోడ్డు ప్రమాదం.. వివాహిత మృతి

image

ఫంక్షన్‌కి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు చెందిన ఘటన NGKL మండలంలోని చందుబట్ల గేటు వద్ద మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. పెంట్లవెల్లికి చెందిన పుష్పలత(47) తన భర్త, కూతురితో కలిసి HYDలో ఫంక్షన్‌కి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో చందుబట్ల గేటు వద్ద కారు కల్వర్టును ఢీకొట్టగా.. పుష్పలత అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదైందని పోలీసులు తెలిపారు.

Similar News

News November 13, 2025

నిజామాబాద్: ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న షీ టీమ్స్

image

నిజామాబాద్ పట్టణంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజి కోటగల్లీ వద్ద బాలికలను ఫాలో చేస్తూ, అసభ్యంగా ప్రవర్తించిన నలుగురు ఆకతాయిలను షీ టీమ్స్ బృందం బుధవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. నిందితులను తదుపరి చర్యల కోసం 2ఃవ టౌన్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని షీ టీమ్స్ సిబ్బంది హెచ్చరించారు.

News November 13, 2025

ఢిల్లీ ఘటన ‘గ్యాస్ సిలిండర్ పేలుడు’: పాక్ మంత్రి

image

ఢిల్లీ <<18270750>>పేలుడు<<>>పై పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్ కుటిల వ్యాఖ్యలు చేశారు. ‘నిన్నటి వరకు అది గ్యాస్ సిలిండర్ పేలుడు.. ఇప్పుడు విదేశీ కుట్ర దాగి ఉందని భారత్ చెబుతోంది’ అని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ఘటనను భారత్ వాడుకుంటుందని ఓ టీవీ షోలో సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో తమపై ఆరోపణలు చేసినా ఆశ్చర్యపోనని అన్నారు. తమ వరకు వస్తే ఊరికే ఉండబోమని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు.

News November 13, 2025

ASF: ఈ-పాస్ వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోండి

image

జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 9వ, 10వ తరగతి చదువుతున్న బీసీ (BC), ఈబీసీ (EBC) విద్యార్థులు ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రమాదేవి తెలిపారు. విద్యార్థులు https://telanganaepass.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.