News February 5, 2025
NGKL: ఘోర రోడ్డు ప్రమాదం.. వివాహిత మృతి

ఫంక్షన్‌కి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు చెందిన ఘటన NGKL మండలంలోని చందుబట్ల గేటు వద్ద మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. పెంట్లవెల్లికి చెందిన పుష్పలత(47) తన భర్త, కూతురితో కలిసి HYDలో ఫంక్షన్‌కి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో చందుబట్ల గేటు వద్ద కారు కల్వర్టును ఢీకొట్టగా.. పుష్పలత అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదైందని పోలీసులు తెలిపారు.
Similar News
News March 5, 2026
100% ఉత్తీర్ణతే లక్ష్యంగా 100 రోజుల యాక్షన్ ప్లాన్: DEO

ప్రభుత్వ పాఠశాలల్లో 10 తరగతి చదివే విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు DEO బాలాజీరావు తెలిపారు. గురువారం కందుకూరు వచ్చిన ఆయన పక్కా ప్రణాళికతో లక్ష్యాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 6 తేదీ నుంచి 100 రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థుల ప్రతిభా స్థాయిని బట్టి 4 కేటగిరీలుగా విభజించి ప్లాన్ ప్రకారం బోధన చేయిస్తున్నట్లు చెప్పారు.
News March 5, 2026
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ప్రత్యేక అధికారి నియామకం

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికను వేగవంతం చేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారిగా డా.కొర్ర లక్ష్మిను నియమించింది. రేపటి నుంచి జూన్ 12 వరకు 99 రోజులపాటు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని, ఈ సమయంలో అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించనున్నారు. ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కార చర్యలు చేపట్టడం, సంక్షేమ పథకాల అమలు వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
News March 5, 2026
కామారెడ్డి: కలెక్టర్‌ను కలిసిన ఈఈ అశోక్

తెలంగాణ రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (TGEWIDC) కామారెడ్డి జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా ఈఈ అశోక్ బాధ్యతలు స్వీకరించారు. గురువారం కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్‌కు పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో విద్యాసంస్థల మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులపై చర్చించారు.


