News February 5, 2025

NGKL: ఘోర రోడ్డు ప్రమాదం.. వివాహిత మృతి

image

ఫంక్షన్‌కి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు చెందిన ఘటన NGKL మండలంలోని చందుబట్ల గేటు వద్ద మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. పెంట్లవెల్లికి చెందిన పుష్పలత(47) తన భర్త, కూతురితో కలిసి HYDలో ఫంక్షన్‌కి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో చందుబట్ల గేటు వద్ద కారు కల్వర్టును ఢీకొట్టగా.. పుష్పలత అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదైందని పోలీసులు తెలిపారు.

Similar News

News December 9, 2025

MDK: ఉత్సాహంతో యువత గ్రామ పోరులోకి

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల పోరుకు యువత రంగంలోకి దిగింది. ప్రస్తుత తరుణంలో రాజకీయాలపై ఇష్టన్నీ, బాధ్యతను గుర్తించిన యువత ఈసారి జరగనున్న ఎన్నికల్లో కీలకపాత్ర పోషించునున్నారు. గ్రామ అభివృద్ధికి మేము సైతం అంటూ ముందుకు కదులుతున్నారు. ప్రశ్నించే గొప్ప తత్వాన్ని అలవర్చుకొని, ప్రజాసేవలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. డబ్బు, మద్యం లేని ఈ రాజకీయాల్లో రాణిస్తారో, లేదో!

News December 9, 2025

నేడు పార్లమెంటులో SIRపై చర్చ

image

12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈసీ నిర్వహిస్తోన్న SIRపై ఇవాళ లోక్‌సభలో 10 గంటలపాటు చర్చ జరగనుంది. 12PMకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చర్చను ప్రారంభిస్తారు. సభ్యుల ప్రసంగాల తర్వాత కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ సమాధానం ఇస్తారు. కాగా ఓట్ల చోరీ, ఎన్నికల కమిషన్ విధానాలు, BLOల ఆత్మహత్యలపై రాహుల్ ప్రశ్నించే అవకాశం ఉంది. సమగ్ర చర్చకు తాము సిద్ధమేనని ఎన్డీఏ కూడా చెబుతోంది.

News December 9, 2025

శ్రీకాకుళం: రేపటి నుంచి ఏపీ టెట్ పరీక్షలు

image

శ్రీకాకుళం జిల్లాలో ఏపీ టెట్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ.రవిబాబు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈనెల 10వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. వీటి కోసం జిల్లాలో నాలుగు కేంద్రాలను ఎంపిక చేస్తామని వెల్లడించారు. ఎచ్చెర్లలో శివాని, వెంకటేశ్వర కళాశాలలు, నరసన్నపేటలో కోర్ టెక్నాలజీ, టెక్కలి ఐతమ్‌లో పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.