News February 5, 2025
NGKL: ఘోర రోడ్డు ప్రమాదం.. వివాహిత మృతి

ఫంక్షన్‌కి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు చెందిన ఘటన NGKL మండలంలోని చందుబట్ల గేటు వద్ద మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. పెంట్లవెల్లికి చెందిన పుష్పలత(47) తన భర్త, కూతురితో కలిసి HYDలో ఫంక్షన్‌కి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో చందుబట్ల గేటు వద్ద కారు కల్వర్టును ఢీకొట్టగా.. పుష్పలత అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదైందని పోలీసులు తెలిపారు.
Similar News
News January 22, 2026
పాలమూరు కార్పొరేటర్‌కు ఫుల్ డిమాండ్

పాలమూరు కార్పొరేషన్లో కార్పొరేటర్ స్థానాలకు తీవ్ర పోటీ నెలకొంది. ప్రతి డివిజన్ నుంచి ఒక్కోపార్టీ తరఫున ఐదారుగురు లీడర్ల మధ్య పోటీ నెలకొంది. మరికొన్ని డివిజన్లలో 10 మందికిపై గానే టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆయా డివిజన్లలో క్యాండిడేట్ల ఎంపిక ప్రధాన పార్టీలకు పెద్ద సవాల్‌గా మారింది. కాంగ్రెస్ 373 మంది, BJP నుంచి 250 మంది దరఖాస్తు చేసుకోగా, BRS నుంచి 446 మంది దరఖాస్తు చేసుకున్నారు.
News January 22, 2026
మూగజీవాలను చంపేవారిపై కఠిన చర్యలు: సీతక్క

TG: మూగజీవాలకు విషమిచ్చి చంపడం దారుణమని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క హెచ్చరించారు. పలు చోట్ల వీధికుక్కలకు విషమిచ్చి చంపిన ఘటనలు తన దృష్టికి వచ్చాయన్నారు. సమస్యకు పరిష్కారం చట్టబద్ధంగా, శాస్త్రీయంగా జరగాలని, సొంత నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. RRలోని యాచారంలో 100 కుక్కలకు విషమిచ్చిన ఘటన వెలుగు చూడగా, కామారెడ్డిలో కోతులను చంపిన ఘటనలో పలువురిపై కేసు నమోదైంది.
News January 22, 2026
వరంగల్: మిర్చి ‘ఘాటు’.. క్వింటా రూ. 29 వేలు!

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి ధరలు రికార్డు సృష్టిస్తున్నాయి. గురువారం జరిగిన వేలంలో యూఎస్ 341 రకం మిర్చి క్వింటాకు ఏకంగా రూ. 29 వేల అత్యధిక ధర పలికింది. గత సోమవారం రూ. 20 వేలుగా ఉన్న ధర, నాలుగు రోజుల్లోనే రూ.9 వేలు పెరగడం విశేషం. ఉమ్మడి జిల్లాలో దిగుబడులు తగ్గడం, అంతర్జాతీయంగా ఎగుమతులకు డిమాండ్ పెరగడమే ఈ ధరల పెరుగుదలకు కారణమని వ్యాపార వర్గాలు విశ్లేషిస్తున్నాయి.


