News March 19, 2025
NGKL: చికిత్స పొందుతూ బాలిక మృతి

ఈనెల 15న ఇంట్లో పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన బాలిక చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన సోమవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల వివరాలు.. NGKL మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఎక్కువగా ఫోన్ చూస్తోందని తండ్రి మందలించటంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News November 23, 2025
మెదక్లో JOBS.. APPLY NOW

మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని మెదక్ సఖి సెంటర్లో పొరుగు సులభ పద్ధతిలో దిగువ తెలిపిన ఉద్యోగాల నియామకానికి అర్హులైన మహిళ అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా అధికారి హేమ భార్గవి సూచించారు. సైకో సోషల్ కౌన్సిలర్, మల్టీ పర్పస్ స్టాఫ్/కుక్ పోస్టులకు డిసెంబర్ 10లోపు జిల్లా సంక్షేమ అధికారి, మహిళా, శిశు, దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయం మెదక్లో సమర్పించాలని తెలిపారు.
News November 23, 2025
కేజీ రూపాయి.. డజను రూ.60!

AP: మూడేళ్లుగా టన్ను <<18336571>>అరటి<<>> రూ.25వేలు పలకగా ఈసారి రూ.1,000లోపు పడిపోవడంతో రాయలసీమ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కేజీకి రూపాయి మాత్రమే వస్తోంది. కిలోకి 6, 7 కాయలు వస్తాయి. 2 కేజీలు అంటే డజను. బయట మార్కెట్లో వ్యాపారులు డజను అరటి రూ.40-60కి అమ్ముతున్నారు. ఈ లెక్కన రైతుకు రూ.2 మాత్రమే వస్తున్నాయంటే వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. లోపం ఎక్కడ ఉంది? COMMENT.
News November 23, 2025
హనుమకొండ: కష్టకాలంలో పార్టీ వెంట ఉంటూ..!

హనుమకొండ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిని టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా నియమించిన నేపథ్యంలో తాజాగా కుడా ఛైర్మన్ వెంకటరామిరెడ్డిని ఏఐసీసీ డీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. కష్టకాలంలో పార్టీ వెంట ఉంటూ, కార్యకర్తలకు అండగా ఉన్న వెంకటరామిరెడ్డికి తగిన గుర్తింపు లభించిందని జిల్లాలోని కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.


