News February 16, 2025

NGKL: చికిత్స పొందుతూ మహిళ మృతి

image

బిజినేపల్లి మండలంలోని వెల్గొండ గ్రామానికి చెందిన ధన్వాడ సౌడమ్మ నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. గ్రామస్థుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సౌడమ్మ బుధవారం పురుగుమందు తాగింది. గుర్తించిన కుటుంబీకులు జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News October 17, 2025

స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో మరో పిటిషన్

image

స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్ వేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు రీ నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని పిటిషన్ వేశారు. ఈ నెల 9న స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ సస్పెండ్ చేస్తూ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు ఇచ్చింది. నోటిఫికేషన్‌ను సస్పెండ్ చేయడానికి సవాలు చేస్తూ సురేందర్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. మరికాసేపట్లో హై కోర్ట్‌లో విచారణ జరగనుంది.

News October 17, 2025

లొంగిపోయిన మావోయిస్ట్ అగ్రనేత ఆశన్న

image

మావోయిస్ట్ పార్టీకి మరో భారీ ఎదురు‌దెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ ఎదుట ఆ పార్టీ అగ్రనేత ఆశన్న(తక్కెళ్లపల్లి వాసుదేవరావు) లొంగిపోయారు. ఆయన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. అటు బస్తర్ జిల్లా జగదల్‌పుర్‌లో 208 మంది మావోయిస్టులు సైతం అస్త్ర సన్యాసం చేశారు. వారిలో 98 మంది పురుషులు, 110 మంది మహిళలు ఉన్నారు. వారి వద్ద ఉన్న 153 తుపాకులు, 11 గ్రానైడ్ లాంచర్లను అప్పగించారు.

News October 17, 2025

వరంగల్ మార్కెట్‌లో మిర్చి ధరల వివరాలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజ మిర్చి క్వింటా నిన్న రూ.14,450 ధర వస్తే.. నేడు రూ.14,550కి చేరింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు గురువారం రూ.15,500 ధర పలకగా.. ఈరోజు రూ.15,100 కి తగ్గింది. వండర్ హాట్(WH) మిర్చికి నిన్న రూ.16,200 ధర వస్తే.. ఈరోజు రూ.16,500 అయింది. అలాగే దీపిక మిర్చికి గురువారం రూ.14,800 ధర వస్తే.. శుక్రవారం రూ.14,500 ధర వచ్చింది.