News March 10, 2025
NGKL: చికిత్స పొందుతూ మహిళ మృతి

ఈ నెల 7న రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ మహిళ చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతిచెందింది. పోలీసుల వివరాలు.. NGKL మండలం వనపట్లకు చెందిన అనూష(32) బైక్పై వస్తుండగా.. కొల్లాపూర్ క్రాస్ రోడ్డు సమీపంలో వెనుక నుంచి ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్రగాయాలు కాగా.. HYDలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News October 14, 2025
బాహుబలిని బీట్ చేసిన కాంతార ఛాప్టర్-1

కాంతార ఛాప్టర్-1 కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. వరల్డ్ వైడ్గా రూ.675Cr వసూలు చేసి బాహుబలి-ది బిగినింగ్(రూ.650Cr)ను బీట్ చేసింది. ఇదేక్రమంలో సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’(రూ.628Cr) రికార్డు కూడా బద్దలైంది. దీంతో దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-20 చిత్రాల్లో 17వ స్థానానికి ఎగబాకింది. అటు 2025లో హయ్యెస్ట్ గ్రాస్ పొందిన సినిమాల్లో రెండో ప్లేస్ దక్కించుకుంది. ఫస్ట్ ప్లేస్లో ఛావ(రూ.808Cr) ఉంది.
News October 14, 2025
శ్రీశైలంలో భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన డీజీపీ

ఈ నెల 16న ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లను రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పరిశీలించారు. హెలిప్యాడ్, రోడ్డు మార్గం, భ్రమరాంబ గెస్ట్ హౌస్, శివాజీ స్ఫూర్తి కేంద్రం, గుడి పరిసర ప్రదేశాలు, సేఫ్ హౌస్ మొదలగు ప్రాంతాలలో పర్యటించి భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News October 14, 2025
వరంగల్: వాట్ అన్ ఐడియా సర్ జీ..!

వరంగల్ జిల్లా నర్సంపేటలో ఓ ఇంటి స్థలం అమ్మకానికి యజమాని ఎంచుకున్న పద్ధతి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 108 గజాల స్థలం, ఇంటిని కేవలం రూ.500 కూపన్తో లక్కీ డ్రా ద్వారా గెలుచుకునే అద్భుతమైన అవకాశం కల్పించాడు. 3 వేల కూపన్లు ముద్రించామని వచ్చే ఏడాది జనవరి 15న గుంజేడు ముసలమ్మ దేవస్థానం వద్ద డ్రా తీయనున్నట్లు చెప్పాడు. రిజిస్ట్రేషన్ ఫీజులను విజేత భరించాలని పేర్కొన్నాడు.