News March 10, 2025
NGKL: చికిత్స పొందుతూ మహిళ మృతి

ఈ నెల 7న రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ మహిళ చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతిచెందింది. పోలీసుల వివరాలు.. NGKL మండలం వనపట్లకు చెందిన అనూష(32) బైక్‌పై వస్తుండగా.. కొల్లాపూర్ క్రాస్ రోడ్డు సమీపంలో వెనుక నుంచి ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్రగాయాలు కాగా.. HYDలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News April 19, 2026
కృష్ణా: Way2Newsలో ఉద్యోగ అవకాశాలు

కృష్ణా జిల్లాలో మండలాల వారీగా Way2Newsలో పని చేయడానికి రిపోర్టర్‌లు కావలెను. అర్హత: ఏదైనా ప్రింట్&ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసిన, చేసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఆసక్తి గల వారు <
News April 19, 2026
ADB: డైరెక్ట్ వాట్సాప్‌కే హాల్ టికెట్

ఆదిలాబాద్‌లో ఓపెన్ ఇంటర్, టెన్త్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. హాల్‌టికెట్లను ఈసారి సులభంగా వాట్సాప్ ద్వారా పొందే వెసులుబాటు కల్పించారు. విద్యార్థులు 8096958096 నంబర్‌ను ఫోన్‌లో సేవ్ చేసుకుని, ‘HI’ అని మెసేజ్ పంపడం ద్వారా ఈ సేవను పొందవచ్చు. అక్కడ కనిపించే ఆప్షన్లలో పదో తరగతి లేదా ఇంటర్ థియరీని ఎంచుకొని, అడ్మిషన్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేస్తే హాల్‌టికెట్ డౌన్‌లోడ్ అవుతుంది.
News April 19, 2026
దామరగిద్ద: కానుకుర్తి రిజర్వాయర్‌కు భూమి పూజ

మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఆదివారం దామరగిద్ద సమీపంలోని కానుకుర్తి రిజర్వాయర్‌కు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రాజెక్టు కోసం కానుకుర్తి గ్రామ రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడం అభినందనీయమని, వారి త్యాగం చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.


