News February 15, 2025

NGKL: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

ఈ నెల 12న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిని వ్యక్తి మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. NGKL జిల్లా పెంట్లవెల్లికి చెందిన షాలు(45) అడ్డాకులలో ఉంటూ రాళ్లు కొడతూ జీవిస్తున్నారు. అడ్డాకుల వైపు నుంచి వచ్చిన పొక్లెయిన్ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రవీందర్(32) అక్కడికక్కడే మృతిచెందగా.. షాలుకు గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ షాలు శుక్రవారం మృతిచెందారు.

Similar News

News December 10, 2025

కామారెడ్డి: జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక

image

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు ఉదయ్ కిరణ్, అబ్దుల్ సమీర్ వాలీబాల్ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికైనట్లు ఇన్‌ఛార్జి పీడీ శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. కళాశాల నుంచి జాతీయస్థాయికి విద్యార్థులు ఎంపిక కావడం అభినందనీయమన్నారు.

News December 10, 2025

2వేల మంది పోలీసులతో ఎన్నికల బందోబస్త్: వరంగల్ సీపీ

image

రేపు జరిగే మొదటి విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా 2వేల మంది పోలీసులతో ఎన్నికల బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఇందులో డీసీపీలు ముగ్గురు, అదనపు డీసీపీలు 11 మంది, 13 మంది ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

News December 10, 2025

ఇతిహాసాలు క్విజ్ – 92 సమాధానం

image

ఈరోజు ప్రశ్న: గణపతి, కార్తీకేయ సోదరులను ముల్లోకాలు చుట్టిరమ్మనే పరీక్ష శివుడు ఎందుకు పెట్టాడు?
సమాధానం: ప్రమథగణాలకు నాయకత్వం వహించడానికి అర్హులెవరో నిర్ణయించడానికి శివుడు ఈ పరీక్ష పెట్టాడు. కార్తికేయుడు లోకాలు చుట్టడానికి వెళ్లగా, గణపతి శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణ చేసి తల్లిదండ్రులే సకల లోకాలు అని నిరూపించాడు. అలా వినాయకుడు సకల కార్యాలలో తొలి పూజలు అందుకునే వరాన్ని అనుగ్రహించాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>