News February 27, 2026
NGKL: చెంచుల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి RDTతో ఒప్పందం: కలెక్టర్

చెంచు పెంటలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఆర్డీటీ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. చెంచు పెంటలో చేపట్టిన ఇంటింటి సర్వే ను సమర్థవంతంగా పూర్తి చేయాలని సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో ఐటీడీఏ, గృహ నిర్మాణ శాఖల అధికారులు, RDT ప్రతినిధులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. చెంచుల నిర్మాణాలు, చెంచు ప్రజల సమగ్ర సర్వే నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు.
Similar News
News April 16, 2026
మెదక్: రైతు బంధు నిలిపివేయడంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

రైతులకు రావాల్సిన రైతు బంధు నిలిపివేయడంపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లా నార్సింగి మండలం శంకాపురం గ్రామానికి చెందిన పిటిషనర్ల భూములకు సంబంధించి రైతు బంధు మొత్తాలు నిలిపివేయడం, పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం చట్టవిరుద్ధమని ప్రాథమికంగా గుర్తించిన న్యాయస్థానం, కలెక్టర్ సహా సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
News April 16, 2026
మామునూర్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధిపై ఏఏఐ సమీక్ష

వరంగల్‌లో మామునూర్ ఎయిర్‌పోర్ట్‌ను గురువారం ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు సందర్శించారు. కలెక్టర్ సత్య శారదతో కలిసి సమావేశమై రన్‌వే, టెర్మినల్ సదుపాయాలు, భద్రత అంశాలను సమీక్షించారు. అభివృద్ధి పనులపై అవసరమైన మెరుగుదలలపై చర్చించారు. ఎయిర్‌పోర్ట్ అభివృద్ధితో రవాణా, పరిశ్రమలు, పర్యాటక రంగాలకు ఊతమిస్తుందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.
News April 16, 2026
ముంబై బ్యాటింగ్.. రోహిత్ శర్మ దూరం

ముంబైతో మ్యాచులో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ ఈ మ్యాచుకు దూరం అయ్యారు. డికాక్ జట్టులోకి వచ్చారు.
ముంబై: డికాక్, రికెల్టన్, సూర్య, తిలక్, నమన్ ధీర్, హార్దిక్ (C), రూథర్‌ఫోర్డ్, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, మయాంక్ రావత్, బుమ్రా.
పంజాబ్: ప్రభ్‌సిమ్రాన్, ప్రియాన్ష్, శ్రేయస్(C), కనోలి, శశాంక్ సింగ్, స్టాయినిస్, యాన్సెన్, బార్ట్‌లెట్, వైశాక్, అర్ష్‌దీప్, చాహల్.


