News February 7, 2025

NGKL: చెరువులో పడి మహిళ మృతి

image

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం సమీపంలోని శ్రీరంగాపురం చెరువులో మునిగి మహిళ మృతి చెందిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. దాదాపు 35 ఏళ్ల వయసున్న మహిళ చెరువులో మునిగి చనిపోయినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చనిపోయిన మహిళకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 16, 2025

జహీరాబాద్: అప్పు తిరిగి ఇవ్వలేదని మహిళ సూసైడ్

image

జహీరాబాద్‌లోని అల్లిపూర్ షేరీనగర్ కాలనీకి చెందిన రాజు, స్వప్న(34) దంపతులు. అవసరాల కోసం బంగారంపై రూ.4 లక్షల రుణం తీసుకున్న రాజు.. డబ్బులను బ్యాంకులో కట్టమని భార్యకు ఇచ్చాడు. అయితే ఆ డబ్బులను ఆమె కోహీర్ మండలం గురుజువాడకు చెందిన శంకర్‌కు అప్పుగా ఇచ్చింది. కొంతకాలంగా ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే శంకర్ మొండికేశాడు. దీంతో భర్తకు ఎం చెప్పాలో తెలియక మానసిక వేదనకు గురైన స్వప్న ఇంట్లో ఉరేసుకుంది.

News October 16, 2025

జనగామ: ఎఫ్ఆర్ఎస్‌లో హాజరు.. విద్యార్థుల బేజారు!

image

ఇంటర్‌లో విద్యార్థుల హాజరు శాతాన్ని మెరుగుపరిచేందుకు ఇంటర్ బోర్డు కమిషనర్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కళాశాలల్లో ఎఫ్ఆర్ఎస్(ఫేస్ రికగ్నిషన్ సిస్టం) హాజరు పద్ధతిని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని 7 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనూ ఈ విధానాన్ని కొనసాగిస్తున్నారు. అయితే దూర ప్రాంతాల నుంచి విద్యార్థులు మాత్రం ఈ నిర్ణయంతో ఇబ్బందులు పడుతున్నారు.

News October 16, 2025

జనగామ: సీట్లు రాని వారికి మరో అవకాశం!

image

ప్రవేశ పరీక్ష రాసి గురుకులాల్లో సీట్లు రాని వారికి గురుకులం మరో అవకాశాన్ని కల్పించింది. జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 5, 6, 7, 9 తరగతుల్లో మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ వెల్ఫేర్ సమన్వయ అధికారి శ్రీనివాస్ రావు తెలిపారు. నేడు(గురువారం), రేపు(శుక్రవారం) జనగామలోని సోషల్ వెల్ఫేర్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.