News March 18, 2025

NGKL: చెరువులో పడి మహిళ మృతి

image

ఓ మహిళ చెరువులో పడి మృతిచెందిన ఘటన ఈ నెల 16న చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. తెలకపల్లి మండలానికి చెందిన చంద్రమ్మ(35) కొంత కాలంగా మద్యానికి బానిసైంది. కుటుంబ సభ్యులు ఎంతచెప్పినా పట్టించుకోలేదు. గ్రామ శివారులో ఉన్న పెద్దచెరువు దగ్గరికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడింది. ఈత రాకపోవటంతో మృతిచెందింది. ఈ మేరకు కేసునమోదైంది.

Similar News

News February 23, 2026

ఎటపాకలో నాలుగు కాళ్ల కోడిపిల్ల జననం

image

ఎటపాక మండలం సీతాపురంలో వింత చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చుక్కా కుమారి పెంచుతున్న కోడి పెట్టిన గుడ్లలో ఒక దాంట్లోంచి నాలుగు కాళ్లతో పుట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విషయం తెలిసిన వెంటనే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సీతాపురానికి చేరుకుని నాలుగు కాళ్ల కోడిపిల్లను ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ప్రస్తుతం కోడిపిల్ల ఆరోగ్యంగా ఉందని యజమాని తెలిపారు.

News February 23, 2026

ఘట్‌కేసర్‌: సైబర్ మోసం.. కూలీ ఖాతా ఖాళీ!

image

కూలి చేసుకుంటూ పూటగడిపే వారి ఖాతాలపై కూడా కన్నేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. యాదాద్రి-భువనగిరి జిల్లా రాజపేట మండలం బొందుగుల్లకు చెందిన బోదాసు విష్ణు (38) ఘట్‌కేసర్‌లోని తన సోదరి ఇంటికి వచ్చాడు. ఈ నెల 12న అతడి SBI ఖాతా నుంచి 3 విడతల్లో మొత్తం రూ.41,799 డెబిట్ అయ్యాయి. సైబర్ కేటుగాళ్ల చేతివాటమే అనుకుని, 1930కు ఫిర్యాదు చేయగా రూ.800 హోల్డ్‌లో పెట్టారు. ఘట్‌కేసర్ PSలో కంప్లైంట్ చేయడంతో కేసు నమోదైంది.

News February 23, 2026

చరిత్రలో ఈరోజు (ఫిబ్రవరి 23)

image

1455- గూటెన్‌బర్గ్ తొలి బైబిల్ ముద్రణ పూర్తి
1876- ప్రముఖ సంఘ సంస్కర్త గాడ్గే మహరాజ్ జననం
1893- డీజిల్ ఇంజిన్‌కు పేటెంట్
1913- ప్రముఖ ఇంద్రజాలికుడు పి.సి.సర్కార్ జననం
1954- పోలియో వ్యాక్సిన్‌ మొదటిసారిగా పిల్లలపై ప్రయోగం
1957- దివంగత మాజీ మంత్రి ఎర్రన్నాయుడు జననం
1969- అలనాటి హీరోయిన్ మధుబాల మరణం (ఫొటోలో)
* World Understanding and Peace Day