News April 21, 2025
NGKL: జర్నలిస్ట్‌లు గౌరవం కాపాడుకోవాలి: ఛైర్మన్

జర్నలిస్టులు క్రమశిక్షణతో మెలుగుతూ తగిన గౌరవం కాపాడుకోవాలని ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి సూచించారు. ఆదివారం సోమశిలలో జరిగిన TUWJ(IJU) రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి వెళ్తున్న ఆయన NGKLలో మాట్లాడారు. మారిన కాలానికి అనుగుణంగా జర్నలిస్టులు వృత్తిపరమైన శిక్షణలో మెలుకువలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు.
Similar News
News April 22, 2025
నిర్మల్ : పోలీసులపై నమ్మకం పెరిగేలా పనిచేయాలి: SP

ప్రజలకు పోలీసులపై మరింత నమ్మకం పెరిగేలా విధులు నిర్వహించాలని ఎస్పీ జానకి షర్మిల అన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదులపై చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలని ఆయా కేసుల్లో నిందితులకు పడే శిక్షల శాతం మరింత పెరిగేలా ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. పట్టణాల్లో దొంగతనాలు జరగకుండా రాత్రి వేళలో గస్తీని మరింత పెంచాలన్నారు.
News April 22, 2025
K.G.Hలో టీచర్లకు వైద్య శిబిరాలు

బదిలీల్లో ప్రాధాన్యత క్యాటగిరీ కిందకు వచ్చే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఈ నెల 24 నుంచి 26 వరకు K.G.Hలో ప్రత్యేక వైద్య శిబిరానికి హాజరుకావాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్ కోరారు. 24న విశాఖ, 25న అనకాపల్లి, 26న అల్లూరి జిల్లాలకు చెందినవారు వైద్య శిబిరాలకు హాజరు కావాలన్నారు. ఈ శిబిరంలో పొందిన సర్టిఫికెట్ల ఆధారంగా కేటగిరీలను వర్గీకరిస్తామని తెలిపారు.
News April 22, 2025
NRPT: అంబేడ్కర్‌ను అవమానించింది కాంగ్రెస్: BJP

రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌ను కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి అడుగడుగునా అవమానించిందని జిల్లా ఎస్సీమోర్చా ఇంఛార్జి, మాజీ ఎంపీ ముని స్వామి అన్నారు. అంబేడ్కర్ జయంతి వారోత్సవాల సందర్భంగా సోమవారం నారాయణపేటలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్ అధ్యక్షతన జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాజ్యంగాన్ని అంబేడ్కర్ ఆశయాలను నెరవేస్తున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని పేర్కొన్నారు.