News March 9, 2025
NGKL: జాతరకు తీసుకెళ్లలేదని ఆత్మహత్య.!

జాతరకు తీసుకెళ్లడం లేదని ఓ చిన్నారి మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన NGKL జిల్లాలో జరిగింది. 9ఏళ్ల బాలుడు చిన్నప్పటి నుంచి అమ్మమ్మ, తాతయ్యల వద్ద ఉంటున్నాడు. వెల్దండ మండలంలో ఉన్న గుండాల శ్రీఅంబాల రామలింగేశ్వర స్వామి జాతరకు తీసుకెళ్లాలని పట్టుబట్టాడు. వారు వద్దనడంతో ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబీకులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Similar News
News November 24, 2025
మెదక్: రిజర్వేషన్ల ఖరారు.. గ్రామాల్లో వేడెక్కనున్న రాజకీయం

ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని సంకల్పించడంతో అధికారులు ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేశారు. దీంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. గత నెలల్లో ప్రభుత్వం 42% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాలని చూసి ఆ దిశగా రిజర్వేషన్లు కల్పించి ఎన్నికల నోటిఫికేషన్ జారి చేసింది. అనూహ్యంగా హైకోర్టు పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని తెలపడంతో ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ ఉపసంహరించుకుంది.
News November 24, 2025
ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యం: ఎస్పీ

ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ బి.రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. అమలాపురంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 26 ఫిర్యాదులు అందాయి. బాధితుల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించిన ఎస్పీ.. సంబంధిత అధికారులతో మాట్లాడారు. చట్టపరిధిలో విచారణ జరిపి, బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని సూచించారు.
News November 24, 2025
నిర్మల్: డిసెంబర్ 5లోపు పరీక్ష ఫీజులు చెల్లించాలి

రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్వహించే టైలరింగ్, డ్రాయింగ్ పరీక్షలకు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ డిసెంబర్ 5 అని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) భోజన్న తెలిపారు. ఈ పరీక్షలు జనవరి, ఫిబ్రవరి 2026లో నిర్వహించబడతాయి. డ్రాయింగ్ లోయర్ గ్రేడ్‌కు రూ.100, హయ్యర్ గ్రేడ్‌కు రూ.150, టైలరింగ్, ఎంబ్రాయిడరీకి రూ.100, హయ్యర్ గ్రేడ్‌కు రూ.200 చొప్పున చెల్లించాలన్నారు.


