News March 9, 2025

NGKL: జాతరకు తీసుకెళ్లలేదని ఆత్మహత్య.!

image

జాతరకు తీసుకెళ్లడం లేదని ఓ చిన్నారి మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన NGKL జిల్లాలో జరిగింది. 9ఏళ్ల బాలుడు చిన్నప్పటి నుంచి అమ్మమ్మ, తాతయ్యల వద్ద ఉంటున్నాడు. వెల్దండ మండలంలో ఉన్న గుండాల శ్రీఅంబాల రామలింగేశ్వర స్వామి జాతరకు తీసుకెళ్లాలని పట్టుబట్టాడు. వారు వద్దనడంతో ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబీకులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Similar News

News January 14, 2026

నల్గొండ: రైస్ మిల్లులు.. అక్రమాలకు నిలయాలు!

image

ప్రభుత్వ ధాన్యం మళ్లింపును అరికట్టేందుకు తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఈ మేరకు రెండు రోజుల వ్యవధిలో చేపట్టిన తనిఖీల్లో భాగంగా సుమారు రూ.60 కోట్లకు పైగా విలువైన సీఎమ్ఆర్ ధాన్యం పక్కదారి పట్టినట్లుగా అధికారులు గుర్తించారు. మొత్తం 8 బృందాలు నల్గొండ, సూర్యాపేటతో పాటు 10 జిల్లాల్లోని 19 రైస్ మిల్లుల్లో తనిఖీ చేశారు.

News January 14, 2026

HZB: కొత్తకొండ జాతరకు బస్సులను ప్రారంభించిన డీఎం

image

కొత్తకొండ జాతరకు వెళ్లే భక్తుల కోసం హుజూరాబాద్ బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సులను డిపో మేనేజర్ రవీంద్రనాథ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ ప్రత్యేక బస్సులో పెద్దలకు రూ.50, పిల్లలకు రూ.30గా ఛార్జీలు నిర్ణయించినట్లు తెలిపారు. వీటిలో మహాలక్ష్మి పథకం కూడా వర్తిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ సారయ్య, తదితరులు పాల్గొన్నారు.

News January 14, 2026

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 4 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 73,014 మంది దర్శించుకోగా.. 19,639 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.27 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.