News March 14, 2025

NGKL: జిల్లాలో భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు..

image

నాగర్ కర్నూల్ జిల్లాలో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగాయి. మార్చ్ నెల మొదటి వారంలోని ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకోవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జిల్లాలోని తెలకపల్లి మండల కేంద్రంలో గడిచిన 24 గంటల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కల్వకుర్తి ప్రాంతంలో శుక్రవారం ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలకు చేరుకున్నాయి.

Similar News

News November 21, 2025

HYD: అటవీ సంపదను కొల్లగొట్టేందుకే మారణకాండ: CPI

image

అటవీ ప్రాంతంలోని ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు అడ్డంకిగా ఉన్న మావోయిస్టులను ఎన్కౌంటర్ల పేరుతో కేంద్రం హత్య చేస్తుందని పలువురు వక్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. CPI ఆధ్వర్యంలో మఖ్ధూం భవన్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. TPCC అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ మాట్లాడుతూ.. జనజీవన స్రవంతిలో కలుస్తామని ముందుకు వచ్చే మావోయిస్టులను పట్టుకొని చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

News November 21, 2025

రాజీనామా యోచనలో కడియం..?

image

వరంగల్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. జూబ్లీహిల్స్ గెలుపు ఊపులో ఉన్న కాంగ్రెస్.. ఫిరాయింపుల విషయంలో రాజీనామా చేయించాలని చూస్తోంది. స్టే.ఘనపూర్ MLAగా ఉన్న కడియం శ్రీహరితో రాజీనామా చేయించి, ఎన్నికలకు వెళ్లి BRSను ఇరుకున పెట్టడానికి CM రేవంత్ స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. ఇదే వేడిలో ఉపఎన్నిక వస్తే కాంగ్రెస్‌కు గ్రౌండ్‌లో మరింత బలం పెరుగుతుందని భావిస్తున్నారు. 2 రోజుల్లో కడియం రాజీనామా చేసే అవకాశముంది.

News November 21, 2025

1956లో ప్రస్థానం ప్రారంభం.. నేటికి JNTUకి 60 ఏళ్లు

image

జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల డైమండ్ జూబ్లీ వేడుకలకు ముస్తాబైంది. 1965లో నాగార్జున ఇంజినీరింగ్ కళాశాలగా ఆవిర్భవించి 1972లో జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌గా అవతరించింది. 2015లో గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహించుకొని నేడు డైమండ్ జూబ్లీ వేడుకలకు యూనివర్సిటీ కళాశాల సిద్ధమైంది. ఈ 60 ఏళ్లలో ఎన్నో ఘనతలు సాధించి ఎంతోమంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చింది.