News January 11, 2026
NGKL జిల్లాలో 1,008 టన్నుల యూరియా నిల్వలు: కలెక్టర్

నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రస్తుతం 1,008 టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెలకు గాను జిల్లాకు 6,619 టన్నుల యూరియా కేటాయించబడిందని, జడ్చర్ల, గద్వాల పాయింట్ల ద్వారా ఇది సరఫరా అవుతుందని పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 300 ఎరువుల దుకాణాల ద్వారా రైతులకు పంపిణీ చేస్తున్నట్లు ఆయన వివరించారు.
Similar News
News January 12, 2026
కామారెడ్డి: సీఎం కప్ క్రీడలకు దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి జిల్లాలో నిర్వహించనున్న ‘సీఎం కప్-2025’ పోటీలకు ఆసక్తి గల క్రీడాకారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ కోరారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లాలో క్లస్టర్, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో ఈ పోటీలు నిర్వహిస్తామన్నారు. గ్రామీణ స్థాయి క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News January 12, 2026
మంచిర్యాల: బాల కార్మికులను వినియోగిస్తే కఠిన చర్యలు

మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో బాల కార్మికులను వినియోగిస్తే ఎన్నికల సంఘం బాలల పరిరక్షణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కుమార్ దీపక్ హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో గోడ ప్రతుల అతికింపు, ప్లెక్సీల ఏర్పాటు, కరపత్రాల పంపిణీ, ప్రచార సమయంలో ప్లకార్డుల ప్రదర్శన, సభలు, సమావేశాలలో బాలబాలికలతో పనులు చేపిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.
News January 12, 2026
కోల్డ్ వేవ్స్.. వీళ్లకు ముప్పు ఎక్కువ!

మరికొన్నిరోజులు చలిగాలుల తీవ్రత కొనసాగుతుందని IMD హెచ్చరించింది. దీంతో గుండె, లంగ్స్, కిడ్నీ వ్యాధిగ్రస్థులు జాగ్రత్తగా ఉండాలని ఎయిమ్స్ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ‘చలికాలంలో రక్తనాళాలు కుంచించుకుపోతాయి. నీరు తీసుకోవడం తగ్గుతుంది. ఉప్పు వాడకం పెరుగుతుంది. ఇవి BP, హార్ట్ అటాక్ ప్రమాదాన్ని పెంచుతాయి’ అని కార్డియాలజీ ప్రొఫెసర్ రాజీవ్ నారంగ్ తెలిపారు. ఉదయం వాకింగ్‌కు వెళ్లకపోవడమే మంచిదని సూచించారు.


