News March 28, 2025
NGKL జిల్లాలో 28 మంది విద్యార్థులు గైర్హాజరు: డీఈవో

జిల్లాలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల్లో 28 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఈఓ రమేష్ కుమార్ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోనీ పరీక్ష కేంద్రాలను తనిఖీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 60 కేంద్రాల్లో 10,584 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 10,556 విద్యార్థులు మాత్రమే హాజరయ్యారని అని పేర్కొన్నారు. 10వ తరగతి పరీక్షలను పక్కాగా నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు.
Similar News
News January 10, 2026
షాద్ నగర్-తిరుపతికి బండ్ల గణేశ్ పాదయాత్ర.. ఎందుకంటే?

ఏపీ సీఎం చంద్రబాబు పట్ల ప్రత్యేక అభిమానాన్ని చాటేందుకు సినీ నిర్మాత బండ్ల గణేశ్ సిద్ధమయ్యారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అరెస్టైన చంద్రబాబు ఎలాంటి మచ్చ లేకుండా విడుదలైతే శ్రీవారిని దర్శించుకుంటానని మొక్కుకున్నారు. కోరిక తీరడంతో HYD షాద్ నగర్ నుంచి తిరుపతికి పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 19న తన నివాసం నుంచి యాత్ర ప్రారంభం కానుండగా తిరుమల శ్రీవారి దర్శనంతో ముగియనుంది.
News January 10, 2026
ఖమేనీ ఫొటోలు కాల్చి.. సిగరెట్లు తాగుతున్న ఇరాన్ యువతులు

ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ఈ క్రమంలో యువతులు, మహిళలు ఖమేనీ ఫొటోలకు నిప్పంటించి సిగరెట్లు వెలిగించుకుంటున్నారు. ఇప్పుడు ఇది ట్రెండ్‌గా మారింది. సుప్రీంలీడర్ ఫొటో అంటించడం, మహిళలు సిగరెట్ తాగడం రెండూ నేరమే. మహిళలపై అణచివేతకు వ్యతిరేకంగా, స్వేచ్ఛను కోరుకుంటూ వాళ్లు ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది. 2022లో యువతి లాకప్ డెత్ సమయంలోనూ ఇలాంటి నిరసనలే మహిళలు చేపట్టారు.
News January 10, 2026
అనంతపురం: గుండెపోటుతో SI మృతి

అనంతపురం జిల్లా పోలీస్ కంట్రోల్ రూం SI మోహన్ ప్రసాద్ విధి నిర్వహణలో ఉండగా గుండెపోటుతో కన్నుమూశారు. అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన ఆయనను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఎస్సై మృతి పట్ల జిల్లా ఎస్పీ జగదీశ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఆ కుటుంబానికి సానుభూతి తెలిపారు. జేఎన్టీయూ రోడ్డులో పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అధికారులు, సహచర సిబ్బంది నివాళులర్పించారు.


