News March 28, 2025
NGKL జిల్లాలో 28 మంది విద్యార్థులు గైర్హాజరు: డీఈవో

జిల్లాలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల్లో 28 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఈఓ రమేష్ కుమార్ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోనీ పరీక్ష కేంద్రాలను తనిఖీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 60 కేంద్రాల్లో 10,584 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 10,556 విద్యార్థులు మాత్రమే హాజరయ్యారని అని పేర్కొన్నారు. 10వ తరగతి పరీక్షలను పక్కాగా నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు.
Similar News
News April 21, 2025
చెట్లకు చికిత్స అందిస్తున్నారు!

ఏంటి ఆశ్చర్యపోతున్నారా? మనుషులకు, జంతువులకు డాక్టర్లు ఉండటం చూశాం. కానీ, చెట్ల ఆరోగ్యం కోసం పంజాబ్‌కు చెందిన IRS అధికారి రోహిత్ మిశ్రా పాటుపడుతున్నారు. ఆయన ప్రపంచంలోనే మొదటి ట్రీ క్లినిక్‌ను స్థాపించగా దీనికి ప్రత్యేకమైన అంబులెన్స్ కూడా ఉంది. ఇందులోని రకరకాల ఆయుర్వేదిక్, ఆర్గానిక్ మందులు మొక్కలకు వచ్చే సమస్యలకు చెక్ పెడతాయని తెలిపారు. అడవిలోని వేలాది మొక్కలకు ఆయన పునర్జన్మనిచ్చారు.
News April 21, 2025
మళ్లీ కలవనున్న ఠాక్రే సోదరులు

హిందీ వ్యతిరేక ఉద్యమంతో మహారాష్ట్ర కజిన్స్ కలుస్తున్నారు. అన్నదమ్ముల పిల్లలైన ఉద్ధవ్ ఠాక్రే (శివసేన-UBT), రాజ్ ఠాక్రే (మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన) 20 ఏళ్లుగా సొంత పార్టీలు నడుపుతున్నారు. స్కూళ్లలో హిందీని తప్పక బోధించాలన్న MH ప్రభుత్వ నిర్ణయాన్ని ఇద్దరూ ఖండించారు. రాష్ట్ర ప్రయోజనాలకై ఉద్ధవ్‌తోనూ కలిసి ఉద్యమిస్తానని MNS చీఫ్ ఇటీవల ప్రకటించగా మాజీ సీఎం కూడా ఓకే అన్నట్లు తాజాగా సిగ్నలిచ్చారు.
News April 21, 2025
రాజమౌళి రెమ్యునరేషన్ రూ.200 కోట్లు?

ఇండియాలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఫిల్మ్ డైరెక్టర్ రాజమౌళి అని IMDb పేర్కొంది. పారితోషికం, ప్రాఫిట్ షేర్ (కలెక్షన్స్ బట్టి), మూవీ హక్కుల విక్రయం ద్వారా ఈ మేరకు పొందుతారని తెలిపింది. ఇది స్టార్ హీరోల రెమ్యునరేషన్ కంటే ఎక్కువ కావడం గమనార్హం. ఇతర దర్శకుల్లో సందీప్ వంగా, ప్రశాంత్ నీల్ ఒక్కో సినిమాకు రూ.90 కోట్లు, రాజ్ కుమార్ హిరానీ రూ.80 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్.