News January 31, 2025

NGKL జిల్లా అభివృద్ధిపై ఎమ్మెల్యేలతో మంత్రి జూపల్లి సమీక్ష

image

నాగర్ కర్నూల్ జిల్లా అభివృద్ధిపై హైదరాబాద్‌లోని సచివాలయంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎంపీ మల్లురవి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తదితర శాఖల అధికారులతో చర్చించారు.

Similar News

News February 28, 2026

3,979 పోస్టులు.. దరఖాస్తుకు 3రోజులే ఛాన్స్

image

యంత్ర ఇండియా లిమిటెడ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలలో 3,979 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇంకా 3 రోజులే(మార్చి 3) సమయం ఉంది. ITI, టెన్త్ అర్హత గలవారు అప్లై చేసుకోవచ్చు. మెరిట్, DV, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. టెన్త్ అభ్యర్థులకు నెలకు రూ.8200, ITI అభ్యర్థులకు రూ.9600 స్టైపెండ్ చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.200+GST, SC, ST, మహిళలకు రూ.100+GST. వెబ్‌సైట్: recruit-gov.com/

News February 28, 2026

నల్లగొండ: 28న జిల్లావ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్

image

జిల్లాలోని అన్ని కోర్టు సముదాయాల్లో ఈ నెల 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. రాజీపడదగ్గ క్రిమినల్, చెక్ బౌన్స్, కుటుంబ వివాదాలు, మోటార్ వాహన ప్రమాదాలు, భూ తగాదాలు వంటి పెండింగ్ కేసులను ఇక్కడ పరిష్కరించుకోవచ్చు. దీనివల్ల కక్షిదారులకు సత్వర న్యాయంతో పాటు సమయం, ఖర్చు ఆదా అవుతాయని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఛైర్మన్ తెలిపారు. అప్పీలుకు తావులేని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News February 28, 2026

NGKL: ఇంటర్ పరీక్షలు.. 159 మంది గైర్హాజరు

image

నాగర్ కర్నూల్ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు శనివారం ప్రశాంతంగా జరిగినట్లు నోడల్ అధికారి వెంకట్ రమణ తెలిపారు. జిల్లాలో మొత్తం 5,921 మంది విద్యార్థులకు గాను 5,763 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు తెలిపారు. 159 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.