News March 26, 2025
NGKL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం, ఏసీలు దగ్ధం

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్రంలోని పలు ఏసీలు అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయాయి. దీంతో సుమారు రెండు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలు ఆర్పి వేసినట్లు జిల్లా ఫైర్ అధికారి కృష్ణమూర్తి తెలిపారు.
Similar News
News October 27, 2025
తిరుపతికి రూ.కోటి.. చిత్తూరుకు రూ.50 లక్షలు విడుదల

మొంథా తుపాన్‌ను ఎదుర్కునేందుకు చిత్తూరు, తిరుపతి జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. జిల్లాలో సహాయక చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తిరుపతి జిల్లాకు రూ.కోటి, చిత్తూరు జిల్లాకు రూ.50 లక్షల నిధులు విడుదల చేసింది. తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
News October 27, 2025
NGKL: వర్షాలకు నల్లబారుతున్న పత్తి.. దిగుబడి తగ్గే ప్రమాదం

నాగర్‌కర్నూల్ జిల్లాలో 20 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తెల్ల బంగారం అని పిలిచే పత్తి నల్లబారుతోంది. కోతకు వచ్చిన పంట పొలాల్లోనే తడిసి ముద్దవడంతో, పత్తి తీయడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లా వ్యాప్తంగా 2.65 లక్షల ఎకరాలలో పత్తి సాగు అయిందని అధికారులు అంచనా వేశారు. ఈ వర్షాల కారణంగా జిల్లాలో పత్తి దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
News October 27, 2025
స్వగ్రామానికి చేరిన తల్లి, కూతురు మృతదేహాలు

కర్నూలు సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన మంగ సంధ్యారాణి (43), ఆమె కుమార్తె చందన (23) మృతదేహాలు స్వగ్రామం మెదక్ మండలం శివాయిపల్లికి చేరాయి. డీఎన్ఏ పరీక్షల అనంతరం నిన్న సాయంత్రం కుటుంబీకులకు అప్పగించారు. భర్త ఆనంద్ గౌడ్ మృతదేహాలను తీసుకొచ్చారు. మృతదేహాలను చూసి కుటుంబసభ్యులు బోరున విలపించారు. ఈరోజు మధ్యాహ్నం అంత్యక్రియలు జరగనున్నాయి.


