News March 30, 2025
NGKL: జిల్లా ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు: కలెక్టర్

తెలుగు నూతన సంవత్సరాది శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ… ఆదివారం తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండగను ప్రజలు ఆనందోత్సాహాలతో, సుఖసంతోషాలతో మధ్య నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరం అందరికీ శుభవార్తలు, విజయాలను తీసుకురావాలన్నారు.
Similar News
News April 24, 2025
పీఓకేలో 42 ఉగ్ర లాంచ్ ప్యాడ్స్!

ఆక్రమిత కశ్మీర్‌లో 42 లాంచ్ ప్యాడ్‌లను పాక్ సిద్ధం చేసినట్లు భారత భద్రతా బలగాలు గుర్తించాయి. 130మంది ఉగ్రవాదులు పైనుంచి ఆదేశాలు కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో చొరబడి విధ్వంసం సృష్టించేందుకు వీరు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇక హిజ్బుల్ ముజాహిదీన్, జైషే మహ్మద్, లష్కరే నుంచి 60మంది ఉగ్రవాదులు, స్థానిక టెర్రరిస్టులు 17మంది కశ్మీర్‌లో యాక్టివ్‌గా ఉన్నారని నిఘా వర్గాలు తెలిపాయి.
News April 24, 2025
విశాఖ: కొద్దిరోజుల్లో పెళ్లి.. యువతి ఆత్మహత్య

మరికొద్ది రోజుల్లో వివాహం అనగా ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలో గురువారం జరిగింది. టూ టౌన్ సీఐ ఎర్రంనాయుడు వివరాల ప్రకారం.. నగరంలోని కల్లుపాకల ప్రాంతానికి చెందిన వెంకటలక్ష్మి ఓ యువకుడిని ప్రేమించింది. ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో పెళ్లి చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో ఏమైందో ఏమో కానీ యువతి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం KGHకు తరలించారు.
News April 24, 2025
ఇది భారత్‌పై దాడి: ప్రధాని మోదీ

పహల్‌గామ్‌లో పర్యాటకులపై దాడిని భారత్‌పై దాడిగా ప్రధాని మోదీ అభివర్ణించారు. మృతుల కుటుంబాలకు దేశం మొత్తం అండగా ఉంటుందన్నారు. ఈ నరమేధాన్ని ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో ఖండించాయని మోదీ గుర్తు చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉగ్రవాదులను విడిచిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. ఆప్తులను కోల్పోయినవారికి న్యాయం చేయడానికి అన్ని చర్యలు చేపడతామని వెల్లడించారు.