News February 22, 2025
NGKL: జిల్లా వాహనదారులకు ఎస్పీ హెచ్చరిక

జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నేటి నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నట్లు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ రఘునాథ్ తెలిపారు. మైనర్లు వాహనాలు నడపడం, మద్యం తాగి వాహనాలు నడపడం, నంబర్ ప్లేట్లు లేని వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్,ఫోర్ వీలర్స్ వాహనదారులు సీటు బెల్టు తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
Similar News
News March 27, 2025
UPDATE: భవనం కూలిన ఘటనలో భద్రాచలంవాసి మృతి..

భద్రాచలంలోని సూపర్ బజార్ సెంటర్‌లో బుధవారం <<15895820>>భవనం కూలిన ఘటన<<>>లో 9 గంటల పాటు సహాయక చర్యలు కొనసాగాయి. రాత్రి రెండు గంటల సమయంలో శిథిలాల్లో చిక్కుకున్న భద్రాచలానికి చెందిన చల్లా కామేశ్వరరావును సహాయక బృందాలు వెలికితీశాయి. కాగా, ఆ సమయంలో అతడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. శిథిలాల కింద ఉపేంద్ర అనే వ్యక్తిని కూడా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
News March 27, 2025
ఫోన్ చూడొద్దన్నందుకు కర్నూలులో యువకుడి ఆత్మహత్య

తల్లిదండ్రుల మందలించారని యువకుడు ఆత్మహత్యకు చేసుకున్న ఘటన కర్నూలులో జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. చౌడేశ్వరి వీధిలో నివాసం ఉంటున్న కృష్ణమోహన్, వసంత దంపతుల కుమారుడు యశ్వంత్ (21) వడ్రంగి పని చేస్తున్నారు. కొన్ని రోజులుగా పనికి వెళ్లకుండా ఫోన్ చూస్తుండంతో వారు మందలించారు. మనస్తాపం చెందిన యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News March 27, 2025
మోహన్‌లాల్ ‘L2 ఎంపురాన్’ పబ్లిక్ టాక్

మోహన్ లాల్, పృథ్వీరాజ్ కాంబోలో తెరకెక్కిన ‘L2 ఎంపురాన్’ ప్రీమియర్ షో చూసిన అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఫస్ట్ హాఫ్ సాఫీగా సాగినా సెకండాఫ్ మైండ్ బ్లోయింగ్‌గా ఉందని నెటిజన్లు పేర్కొంటున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్‌తో పాటు సీక్వెల్‌పై ఇచ్చే సర్‌ప్రైజ్ అదిరిపోయిందని పోస్టులు పెడుతున్నారు. మ్యూజిక్, ఫైట్స్ సినిమాకు హైలైట్ అంటున్నారు. కాసేపట్లో WAY2NEWS రివ్యూ.