News April 24, 2024
NGKL: జోరుగా ప్రచారం
నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారాన్ని ఉదృతం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి, బిజెపి అభ్యర్థి భరత్ ప్రసాద్, బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. స్థానిక సమస్యలతో పాటు అధికార పార్టీపై విమర్శలకు పదును పెడుతున్నారు.
Similar News
News December 27, 2024
REWIND: పాలమూరుకు అండగా మన్మోహన్ సింగ్
మన్మోహన్ సింగ్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రెండుసార్లు పర్యటించారు. మొదటి పర్యటనలో జులై 1 2004న ఆత్మహత్య చేసుకున్న 13 మంది రైతులకు రూ.19.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ధైర్యం కల్పించారు. రెండోసారి అక్టోబర్ 26 2006న కొత్తకోటలో పర్యటించి.. HYD- బెంగళూరు జాతీయ రహదారి(NH-44) విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పర్యటనలో ఆయన ఉమ్మడి పాలమూరు వాసుల మనసు గెలుచుకున్నారు.
News December 27, 2024
కొందుర్గు: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
షాద్నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం గంగన్నగూడానికి చెందిన శేఖర్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసుల వివరాలు.. గ్రామానికి సమీపంలో ఉన్న ఉప్పలకుంట చెరువులో శేఖర్ రెడ్డి గతంలో చేపలు బయటకు వెళ్లేవాడు. ఈనెల 24న ఇంటి నుంచి వెళ్లిన శేఖర్ రెడ్డి తిరిగి రాకపోవడంతో పలుచోట్ల గాలించగా చెరువులో శవమై కనిపించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్య? హత్య? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
News December 26, 2024
NGKL ఎంపీని కలిసిన పీయూ ఉపకులపతి
హైదరాబాదులోని NGKL ఎంపీ డాక్టర్ మల్లు రవి నివాసంలో గురువారం పాలమూరు పీయూ ఉపకులపతి శ్రీనివాస్ కలిసి పీజీ సెంటర్ స్థాపన గురించి వినతి పత్రం అందజేశారు. యూనివర్సిటీలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఎంపీతో చర్చించారు. సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అనుమతులు వచ్చే విధంగా చూస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు.