News January 26, 2025
NGKL: టీచర్‌ను సస్పెండ్ చేసిన డీఈవో

నాగర్ కర్నూల్ జిల్లా బాల్మురు మండలంలోని కొండానాగుల గ్రామంలోని జడ్పీ పాఠశాలలో విద్యార్థులపై చెప్పులతో దాడి చేసిన ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ డీఈవో రమేష్ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని తెలిపారు. విద్యార్థులపై దాడి ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది.
Similar News
News February 14, 2025
శావల్యాపురంలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం

శావల్యాపురంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని గుంటూరు-కర్నూలు రహదారిపై సోసైటీ కార్యాలయం వద్ద గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం 108 సిబ్బంది వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
News February 14, 2025
కర్నూలులో బర్డ్ ఫ్లూ తొలి కేసు.. రెడ్ జోన్‌గా ప్రకటన

కర్నూలులో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. నగరంలోని నరసింహారావు పేటలో నమోదైనట్లు KMC ఆరోగ్య శాఖ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో నరసింహారావు పేట, పరిసర ప్రాంతాలను రెడ్ జోన్‌గా ప్రకటించినట్లు వెల్లడించారు. సంకల్ప్ బాగ్‌లో ఓ వ్యక్తి తన నివాసంలో కోడిని పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలో ఉన్నట్టుండి ఆ కోడి చనిపోవడంతో పరీక్షలు చేయించాడు. పరీక్షలో బర్డ్ ఫ్లూ సోకినట్లు తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
News February 14, 2025
రాంబిల్లి: బాలికపై లైంగిక దాడి

అనకాపల్లి జిల్లాలో ఓ బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. రాంబిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో మైనర్ బాలికను సేనాపతి నాగేంద్ర (20) అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఈనెల 10వ తేదీన జరగ్గా పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు గురువారం అరెస్టు చేశారు. అరెస్ట్ చేసిన నిందితుడిని కోర్టులో హాజరు పరిచినట్లు రాంబిల్లి సీఐ సీహెచ్ నర్సింగరావు తెలిపారు.