News April 5, 2025
NGKL: డిగ్రీ విద్యార్థి SUICIDE

బల్మూర్ మండలంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిన్న రాత్రి జరిగింది. స్థానికుల వివరాలు.. తుమ్మెన్పేటకు చెందిన అరవింద్(20) ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. వారం రోజుల క్రితం ఉగాదికి ఇంటికి వచ్చాడు. శుక్రవారం రాత్రి వ్యవసాయ పొలం వద్ద ఎవరూ లేని సమయంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 12, 2025
విదేశీ పర్యటనలకు ప్రభుత్వ టీచర్లు

TG: ప్రభుత్వ టీచర్లు, హెడ్ మాస్టర్స్, ప్రిన్సిపల్స్ కోసం ప్రభుత్వం అంతర్జాతీయ ఎక్స్పోజర్ సందర్శనలు, విద్యా మార్పిడి కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ ఏడాది OCT, NOVలో టీచర్స్ సింగపూర్, ఫిన్లాండ్, వియత్నాం, జపాన్ను సందర్శిస్తారు. జిల్లా నుంచి ముగ్గురు చొప్పున విదేశీ పర్యటనకు కలెక్టర్లు ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేస్తారు. సుమారు 160మంది టీచర్స్ను 4 బ్యాచులుగా విదేశాలకు పంపుతారు.
News October 12, 2025
ఈనెల 14న బంద్: దుడుకు లక్ష్మీనారాయణ

బీసీల రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడాన్ని నిరసిస్తూ ఈనెల 14న బంద్ పాటించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ అన్నారు. నల్గొండలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ బంద్లో బడుగు బలహీన వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుండు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
News October 12, 2025
NGKL: మద్యం దుకాణాలకు 85 దరఖాస్తులు

నాగర్ కర్నూల్ జిల్లాలో మద్యం దుకాణాలకు శనివారం సాయంత్రం నాటికి మొత్తం 85 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రకటించారు. మొత్తం 67 మద్యం దుకాణాలకు గాను నాగర్ కర్నూల్ పరిధి నుంచి 39, తెలకపల్లి పరిధి నుంచి 6, కొల్లాపూర్ పరిధి నుంచి 7, కల్వకుర్తి పరిధి నుంచి 32, అచ్చంపేట పరిధి నుంచి ఒక్క దరఖాస్తు వచ్చినట్లు తెలిపారు. ఈనెల 18 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు.