News April 14, 2025

NGKL: డీఎస్పీ నుంచి బీఎస్పీలోకి చేరికలు

image

BSP తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ సమక్షంలో నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన మిద్దె శివప్రసాద్ (నాగర్ కర్నూల్), పంజుగుల శంకర్ (కల్వకుర్తి), మల్లెపాకుల సైదులు (అచ్చంపేట) ధర్మ సమాజ్ పార్టీని వీడి బహుజన్ సమాజ్ పార్టీలో సోమవారం చేరారు. మంద ప్రభాకర్ పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు. స్టేట్ సెంట్రల్ కోఆర్డినేటర్ దయానందరావు, రాష్ట్ర నాయకులు శివరామకృష్ణ, అంతటి నాగన్న తదితరులు పాల్గొన్నారు.

Similar News

News February 26, 2026

ఉట్నూర్ ఐటీడీఏ PO ఖుష్బూ గుప్త బదిలీ

image

రాష్ట్రవ్యాప్త ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా ఉట్నూర్ ఐటీడీఏ PO ఖుష్బూ గుప్తను ప్రభుత్వం బదిలీ చేసింది. మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రాజెక్ట్ అధికారిగా ఖుష్బూ గుప్త మహిళ స్వయం సంఘాల అభివృద్ధి ఉపాధి కల్పన తదితర అంశాలపై జాతీయస్థాయిలో అవార్డును సైతం పొందారు. అనంతరం వ్యక్తిగత సెలవులపై వెళ్లిన పిఓ స్థానంలో ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మట్ పిఓ వ్యవహరిస్తున్నారు..

News February 26, 2026

వరంగల్: IASల బదిలీ.. ఖాళీగానే ‘కీలక’ పోస్టులు..!

image

ఉమ్మడి జిల్లాలో కీలక అధికారిక పోస్టుల భర్తీపై సందిగ్ధం నెలకొంది. ఏటూరునాగారం ఐటీడీఏ పీవోగా ఉన్న చిత్ర కరీంనగర్ కలెక్టర్‌గా వెళ్లడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది. గతంలో జరిగిన అక్రమాల నేపథ్యంలో ఇక్కడ ఐఏఎస్ అధికారి అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు GWMC కమిషనర్‌గా రెగ్యులర్ అధికారిని నియమించకుండా, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌కే అదనపు బాధ్యతలు అప్పగించారు. జనగామ అదనపు కలెక్టర్ స్థానం సైతం ఖాళీ అయ్యింది.

News February 26, 2026

నారాయణపేట అదనపు కలెక్టర్‌గా ఫణీంద్ర రెడ్డి

image

నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్‌గా జి. ఫణీంద్ర రెడ్డి నియమితులయ్యారు. రాష్ట్రవ్యాప్త ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (TGMSIDC) మేనేజింగ్ డైరెక్టర్‌గా సేవలందించిన ఆయనను నారాయణపేటకు బదిలీ చేశారు. త్వరలోనే ఆయన జిల్లా కేంద్రంలో బాధ్యతలు స్వీకరించనున్నారు.