News November 1, 2024
NGKL: డెంగ్యూతో బాలుడి మృతి
నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని మర్రిపల్లికి చెందిన బాలుడు శశివర్ధన్ డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నాడు. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకొన్నాయి. వర్షాకాలం నేపథ్యంలో ప్రతిఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Similar News
News December 14, 2024
NRPT: కలెక్టరేట్లో జరిగే ప్రజావాణి రద్దు
నారాయణపేట కలెక్టరేట్లో సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రూప్ – 2 పరీక్షల నేపథ్యంలో అధికారులు పరీక్ష విధులకు హాజరు కానుండటంతో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు చెప్పారు. ఇట్టి విషయాన్ని జిల్లాలోని ప్రజలు గమనించి అర్జీలు ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు రాకూడదని సూచించారు.
News December 14, 2024
ఉమ్మడి పాలమూరులో నేటి ముఖ్య వార్తలు!
❤లగచర్లకు వెళ్తా..ఎవరోస్తారో చూస్తా:డీకే అరుణ
❤ఇందిరమ్మ ఇండ్ల సర్వే పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్లు
❤గద్వాల:హైవే- 44పై గడ్డి ట్రాక్టర్ దగ్దం
❤మర్రి జనార్దన్ రెడ్డికు ఈడీ నోటీసులు
❤కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి:SFI
❤గ్రూప్-2..144 సెక్షన్ అమలు:SPలు
❤మధ్యాహ్న భోజనం..అధికారుల ఫోకస్
❤గండీడ్:ప్రేమను ఒప్పుకోలేదని యువకుడి సూసైడ్
❤కొనసాగుతున్న సీఎం కప్-2024 పోటీలు
News December 13, 2024
లగచర్లకు వెళ్తా.. ఎవరడ్డొస్తారో చూస్తా: డీకే అరుణ
గుండెనొప్పి సమస్య ఉందని చెప్పిన రైతు హిర్యానాయక్‌కు సంకెళ్లువేసి తీసుకెళ్తారా అని MP DK అరుణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లగచర్లకు చెందిన రైతు హీర్యానాయక్‌కు పోలీసులు బేడీలువేసి ఆస్పత్రికి తీసుకెళ్లిన ఘటనపై ఆమె స్పందించారు. ఈ మేరకు ఢిల్లీ నుంచి ప్రకటన విడుదల చేశారు. అరెస్టు చేసిన రైతులను బేషరతుగా విడుదల చేయాలన్నారు. పార్లమెంట్ సమావేశాల తర్వాత లగచర్లకు వెళ్తానని ఎవరడ్డొస్తారో చూస్తానని పేర్కొన్నారు.