News February 2, 2025
NGKL: తరగతి గదిలో చరవాణిలను వినియోగిస్తే చర్యలు: డీఈఓ

నాగర్ కర్నూల్ మండలంలోని గగ్గలపల్లి ప్రాథమిక పాఠశాల తరగతి గదిలో సెల్‌ఫోన్ మాట్లాడుతున్న ఇద్దరు ఉపాధ్యాయులపై డీఈఓ రమేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు ఉపాధ్యాయుల సెల్ ఫోన్లను అయన సీజ్ చేశారు. శనివారం మండల పరిధిలోని గద్దలపల్లి ప్రాథమిక పాఠశాలలో తరగతి గదిలో ఉపాధ్యాయులు విద్యాబోధన చేయకుండా సెల్ఫోన్లను వినియోగిస్తున్న అంశాన్ని డీఈవో గుర్తించి, ఇద్దరు ఉపాధ్యాయులపై డిఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Similar News
News February 16, 2025
ముధోల్: కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు మృతి

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు నాగేష్ శాస్త్రి HYDలోని ఆసుపత్రిలో అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మాజీ మంత్రి, దివంగత నేత గడ్డేన్నకు శిష్యుడిగా పేరొందారు. ఆదివారం ఉదయం 11గంటలకు స్వగ్రామం ముధోల్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
News February 16, 2025
అల్లూరి అనుచరులకు అపార్ట్మెంట్‌లు సిద్ధం

అల్లూరి వారసులకు కొయ్యూరు మండలం నడింపాలెం వద్ద డబుల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్లు సిద్ధం అయ్యాయి. స్వాతంత్ర్య పోరాటంలో నాటి బ్రిటిష్ అధికారులను గడగడలాడించిన విప్లవవీరుడు అల్లూరికి కుడిభుజంగా పనిచేసిన గాం గంటన్నదొర, మల్లుదొరకు చెందిన 11 కుటుంబాలకు క్షత్రియ పరిషత్ వీటిని ₹3.5 కోట్లతో నిర్మించింది. వీటిని అల్లూరి జిల్లా కలెక్టర్ ఏ.ఎస్ దినేశ్ కుమార్ సోమవారం ప్రారంభిస్తారు.
News February 16, 2025
NLG: 75 మందికి కౌన్సెలింగ్.. పోస్టింగ్ ఆర్డర్లు

2008 డీఎస్సీలో నష్టపోయిన బీఈడీ అభ్యర్థులకు కాంట్రాక్టు పద్ధతిన ఉద్యోగాలు ఇచ్చేందుకు విద్యాశాఖ ఆదేశాలు ఇవ్వడంతో డీఈఓ బిక్షపతి శనివారం కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఆర్డర్లు అందజేశారు. జిల్లాలో 75 మంది అభ్యర్థులకు శనివారం డీఈఓ కార్యాలయంలో నియామక ఉత్తర్వులు అందజేశారు. వీరికి ప్రతి నెల రూ.31,040 వేతనం ఇవ్వనున్నారు.