News February 17, 2026
NGKL: తాగునీటి కోసం మందస్త చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

రాబోయే వేసవి కాలంలో జిల్లాలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మంగళవారం ఆదేశించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యుాఎస్ ఇంజీనీర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో కలిసి తాగునీటి సరఫరా, నిల్వలు, పైప్‌లైన్ వ్యవస్థపై విస్తృతంగా సమీక్ష నిర్వహించారు. వారికి పలు సూచనలు చేశారు.
Similar News
News March 17, 2026
అక్రమ కేసులకు భయపడం: కాకాణి

తప్పు చేసిన వారిని వదిలేసి, ప్రశ్నించే వారిని జైలుకు పంపుతారా? అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. నెల్లూరు జైలులో ఉన్న మాజీ డీసీసీబీ అధ్యక్షుడు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిని పరామర్శించారు. ఇసుక దోపిడీని ప్రశ్నించినందుకే ఆయనపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. కూటమి నేతలు చెప్పినట్లు అక్రమ అరెస్టులు చేస్తున్న అధికారులు భవిష్యత్తులో ఇబ్బందులు పడతారని హెచ్చరించారు.
News March 17, 2026
ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో DA హైక్?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల DAను మార్చి చివరి లేదా ఏప్రిల్ తొలి వారంలో పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతమున్న 58% DAను 60% లేదా 61%కి పెంచే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. AICPI డేటా ప్రకారం కనీసం 2% పెంపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ పెంపు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. గత 3 నెలల బకాయిలు కూడా ఒకేసారి అందే అవకాశం ఉంది. దీనివల్ల ‘బేసిక్ పే’ను బట్టి నెలకు రూ.వేలల్లో జీతం పెరగనుంది.
News March 17, 2026
గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలి: కృష్ణా కలెక్టర్

జిల్లాలో గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణాలపై సంబంధిత అధికారులతో
మచిలీపట్నంలో ఆయన సమీక్షించారు. జిల్లాలో 20 రోజులుగా గృహ నిర్మాణ పనులు పురోగతి పరిశీలిస్తే 844 గృహాలు దశల వారి మార్పు జరిగాయన్నారు. వాటిలో 306 గృహాలు పైకప్పు స్థాయి నుంచి రూఫ్ క్యాస్ట్ స్థాయికి చేరుకున్నాయన్నారు.


