News April 8, 2025

NGKL: దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్ 

image

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుదారుల సమస్యలపై సకాలంలో తగిన సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ అన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) పి అమరేందర్, ఏఓ చంద్రశేఖర్, సూపరిండెంటెంట్లు, అధికారులు ఉన్నారు.

Similar News

News April 18, 2025

నితీశ్ ఈసారి అంతంతమాత్రమే..!

image

IPL: గత సీజన్లో రాణించి వెలుగులోకి వచ్చిన తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ఈసారి తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. ఈ సీజన్‌లో 7 మ్యాచుల్లో 6 సార్లు బ్యాటింగ్ చేసిన నితీశ్ కేవలం 131 పరుగులే చేశారు. ఆ ఇన్నింగ్స్ ఇలా ఉన్నాయి.. 30(15), 32(28), 0(2), 19(15), 31(34), 19(21). ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. స్ట్రైక్ రేట్ కూడా ఆకట్టుకునేలా లేదని, ఆయన బ్యాటింగ్ మెరుగుపర్చుకోవాల్సి ఉందని నెటిజన్లు అంటున్నారు.

News April 18, 2025

వరల్డ్ ప్రెస్ ఫొటో ఆఫ్‌ ది ఇయర్‌గా యుద్ధ బాధితుడి చిత్రం

image

గాజా‌పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో గాయపడిన ఓ బాలుడి చిత్రం ఈ ఏడాది వరల్డ్ ప్రెస్ ఫొటో ఆఫ్‌ ది ఇయర్‌గా ఎంపికైంది. పాలస్తీనాకు చెందిన ఫొటోగ్రాఫర్ సమర్ అబు ఎలూఫ్ ఈ ఫొటో తీశారు. ఈ చిత్రంలోని బాలుడు రెండు చేతులు కోల్పోయి దీనస్థితిలో కనిపిస్తున్నాడు. ఈ యుద్ధం వల్ల భవిష్యత్తు తరాలు ఎలా అంధకారంలోకి వెళ్లాయో ఈ చిత్రం చెబుతుందని వరల్డ్ ప్రెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తెలిపారు.

News April 18, 2025

సంగారెడ్డి: భర్త ఆత్మహత్య

image

భార్యలు తన దగ్గర లేరని భర్త గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. అస్సాంకు చెందిన బిశాల్(30) కొల్లూరులో కార్ వాష్ సెంటర్లో పనిచేస్తున్నాడు. మొదటి భార్యతో బిశాల్ తరుచూ గొడవపడటంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. ఆ తరువాత నందిగామకు చెందిన మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. వారు తరుచూ గొడవపడటంతో ఆమె కూడా వెళ్లింది. మనస్థాపం చెందిన బిశాల్ కారు వాష్ సెంటర్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడని సీఐ తెలిపారు.

error: Content is protected !!