News September 21, 2024
NGKL: దేశంలోనే తొలి ఆర్థోడాంటిస్ట్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి
బెంగళూరులో నిర్వహించిన ఇండియన్ ఆర్థోడాంటిస్ట్ కాన్ఫరెన్స్‌కు ముఖ్యఅతిథిగా నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి హాజరయ్యారు. దేశంలోనే తొలి ఆర్థోడాంటిస్ట్ ఎమ్మెల్యే కుచుకూళ్లను కౌన్సిల్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇంతటి గొప్ప స్థానంలో ఉంచినందుకు నాగర్ కర్నూల్ ప్రజలకు, తనను గుర్తించి గౌరవ సత్కారం చేసినందుకు కౌన్సిల్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News October 11, 2024
MBNR: సర్పంచ్ ఎన్నికలు.. గ్రామాల్లో సందడి
MBNR, NGKL,GDWL, NRPT,WNP జిల్లాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే అధికారులు ఓటర్ జాబితా పనిలో నిమగ్నమవగా పోటీ చేయాలనుకునేవారు ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే తాము ఎన్నికల్లో గెలవాలంటే ఎలాంటి మేనిఫెస్టో రెడీ చేయాలనే దానిపై వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకు ప్రత్యేక చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇక మరికొందరు తమ గ్రామంలో ఓటర్ల వివరాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

వనపర్తి: స్వీపర్ కూతురు టీచర్..!
వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం మాధవరావుపల్లి గ్రామానికి చెందిన మండ్ల వెంకటయ్య ప్రభుత్వ స్కూల్‌లో స్వీపర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన కూతురు వనిత డీఎస్సీ ఫలితాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ SGT జాబ్ సాధించింది. కాగా నాన్నకు తోడుగా స్వీపర్‌గా సాయం చేసేది. వనిత తల్లిదండ్రులు మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచే చదువులో ముందంజలో ఉంటూ ఉద్యోగాన్ని సాధించినట్లు తెలిపారు. ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఆమెను అభినందించారు.