News March 29, 2025
NGKL: దోమలపెంట వద్ద రోడ్డు ప్రమాదం.. UPDATE

శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారి <<15928031>>దోమల పెంట సమీప అటవీ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదం<<>>లో మహారాష్ట్ర ఐపీఎస్ అధికారి సుధాకర్ పటేల్ దుర్మరణం పాలయ్యారు. పోలీసుల వివరాలు.. పోలీసు అకాడమీలో విధులు నిర్వహిస్తున్న సుధాకర్ పటేల్‌తో పాటు మరో వ్యక్తి భగవత్ కృష్ణారావు మృతి చెందారు. శ్రీశైలం దర్శనానికి వెళ్తుండగా హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో వీరిరువురు మృతి చెందారు.
Similar News
News October 28, 2025
ప్రారంభమైన వరి ధాన్యం, మొక్కజొన్న, పత్తి కొనుగోళ్లు: కలెక్టర్

వరి ధాన్యం, మొక్కజొన్న, పత్తి కొనుగోలు కేంద్రాలను HNK జిల్లాలో ప్రారంభమైనట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. పంటల ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. కేంద్రాలలో గన్నీ సంచులు, టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, తేమ మీటర్లు, ఎలక్ట్రానిక్ కాంటాలు ఏర్పాటు చేశామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా 7330751364ను సంప్రదించాలని సూచించారు.
News October 28, 2025
అక్టోబర్ 28: చరిత్రలో ఈరోజు

1867: స్వామి వివేకానంద బోధనలకు ప్రభావితమై హిందూమతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళ సిస్టర్ నివేదిత జననం
1909: రచయిత కొడవటిగంటి కుటుంబరావు జననం
1924: నటి సూర్యకాంతం జననం (ఫొటోలో)
1959: సినీ నటుడు గోవిందరాజు సుబ్బారావు మరణం
☛ అంతర్జాతీయ యానిమేషన్ డే
News October 28, 2025
ముచ్చటగా మూడు షాపులు దక్కించుకున్న మహిళ

మహబూబాబాద్ జిల్లాలోని ఓ మహిళను అదృష్టం వరించింది. లక్కీ డ్రాలో ముచ్చటగా మూడు వైన్ షాపులను దక్కించుకుంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌కు చెందిన ఎన్.శ్రీవాణికి డోర్నకల్ పట్టణంలో గౌడ కేటగిరీలో రెండు షాపులు రాగా.. ముల్కలపల్లిలో సైతం ఓ షాప్ వచ్చింది. దీంతో వారి ఆనందానికి హద్దులు లేవు. మీకు తెలిసిన వారికి లక్కీ డ్రాలో షాప్‌లు వస్తే కామెంట్లో తెలపండి.


