News April 12, 2025
NGKL: నల్లమలలో దద్దరిల్లిన శివనామ స్మరణం

‘వస్తున్నాం.. వస్తున్నాం.. లింగమయ్య’ అంటూ చేసిన శరణుఘోషతో నల్లమల అటవీ ప్రాంతం దద్దరిల్లింది. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు రాంపూర్ పెంట వరకు వచ్చిన భక్తులు అక్కడినుంచి నాలుగు కిలోమీటర్లు దట్టమైన అటవీ ప్రాంతంలో కాలినడకన వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. సలేశ్వరం క్షేత్రం వద్ద 200 అడుగుల ఎత్తు నుంచి జాలువారే జలపాతం వద్ద భక్తులు సందడి చేశారు.
Similar News
News November 23, 2025
నేడు పుట్టపర్తికి సీఎం రేవంత్ రెడ్డి

పుట్టపర్తిలో ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 8.45 గంటలకు హెలికాప్టర్లో పుట్టపర్తి విమానాశ్రయం చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన సత్యసాయి హిల్ వ్యూ స్టేడియంలో జరిగే బాబా శతజయంతి ఉత్సవాలకు హాజరు కానున్నారు. 11 గంటలకు సాయి కుల్వంత్ సభా మందిరంలో బాబా మహాసమాధి దర్శించుకుంటారు. 11.45 గంటలకు సత్యసాయి విమానాశ్రయం నుంచి తిరుగుపయనం అవుతారు.
News November 23, 2025
ప.గో: వందేళ్ల వేడుకకు వేళాయె..!

ప.గో జిల్లాలో ఈ నెల 23న శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శనివారం భీమవరంలో సత్యసాయి సేవా సంస్థ ప్రతినిధులతో ఆమె సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన విధివిధానాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
News November 23, 2025
మెదక్లో JOBS.. APPLY NOW

మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని మెదక్ సఖి సెంటర్లో పొరుగు సులభ పద్ధతిలో దిగువ తెలిపిన ఉద్యోగాల నియామకానికి అర్హులైన మహిళ అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా అధికారి హేమ భార్గవి సూచించారు. సైకో సోషల్ కౌన్సిలర్, మల్టీ పర్పస్ స్టాఫ్/కుక్ పోస్టులకు డిసెంబర్ 10లోపు జిల్లా సంక్షేమ అధికారి, మహిళా, శిశు, దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయం మెదక్లో సమర్పించాలని తెలిపారు.


