News April 12, 2025
NGKL: నల్లమలలో దద్దరిల్లిన శివనామ స్మరణం

‘వస్తున్నాం.. వస్తున్నాం.. లింగమయ్య’ అంటూ చేసిన శరణుఘోషతో నల్లమల అటవీ ప్రాంతం దద్దరిల్లింది. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు రాంపూర్ పెంట వరకు వచ్చిన భక్తులు అక్కడినుంచి నాలుగు కిలోమీటర్లు దట్టమైన అటవీ ప్రాంతంలో కాలినడకన వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. సలేశ్వరం క్షేత్రం వద్ద 200 అడుగుల ఎత్తు నుంచి జాలువారే జలపాతం వద్ద భక్తులు సందడి చేశారు.
Similar News
News April 17, 2026
పాలమూరు: TCC దరఖాస్తుల ఆహ్వానం

లోయర్ గ్రేడ్ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు(TCC)లో భాగంగా 42 రోజుల వేసవి శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పరీక్షల విభాగం సంచాలకుడు పీవీ శ్రీహరి తెలిపారు. వయస్సు 18-45 ఉన్నవారు ఈనెల 18 నుంచి డీఈవో కార్యాలయంలో దరఖాస్తులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ ఏడాది కొత్తగా మహబూబ్‌నగర్‌లో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, వచ్చే నెల నుంచి టైలరింగ్, డ్రాయింగ్, సంగీతంలో శిక్షణ ఉంటుందన్నారు.
News April 17, 2026
మహబూబ్‌నగర్‌లో ఈ నెల 18న ఉద్యోగ మేళా

మహబూబ్‌నగర్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 18న ఉదయం 10:30 గంటలకు ఎంప్లాయ్మెంట్ ఎక్సైజ్ పిల్లలమర్రి రోడ్డులో ఉద్యోగమేళా నిర్వహించనున్నారు. 10వ తరగతి ఆపై చదివిన 18-30 ఏళ్ల యువత 6 ప్రైవేట్ సంస్థల్లో 250 ఖాళీల భర్తీకి అర్హులని జిల్లా ఉపాధి కల్పన అధికారి మైత్రి ప్రియ తెలిపారు. ఆసక్తి గలవారు సర్టిఫికెట్లు, బయోడేటాతో హాజరుకావాలని, పూర్తి వివరాలకు 8919380410 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
News April 17, 2026
విజయవాడ నుంచి ‘డ్రగ్స్’ సరఫరా.. ముగ్గురి అరెస్ట్!

హైదరాబాద్‌లోని కొండాపూర్ వేదికగా సాగుతున్న డ్రగ్స్ దందాను ఎక్సైజ్ పోలీసులు ఛేదించారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు మత్తు పదార్థాలను తరలిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 6.09 గ్రాముల MDMA డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఈ ముఠా మురళి, వికాస్, భరత్ అనే వ్యక్తులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ ముఠా వెనుక ఉన్న ఇతర నెట్‌వర్క్‌పై పోలీసులు ఆరా తీస్తున్నారు.


