News November 3, 2024

NGKL: నీటి సంపులో పడి బాలుడి మృతి

image

వంగూరు మండలంలోని వంగూరు గేట్ దగ్గర నివాసం ఉంటున్న రమేశ్, సంధ్య దంపతుల చిన్న కుమారుడు సత్యదేవ్(2) ఇంటి ముందు ఆడుకుంటుండగా ఆదివారం ప్రమాదవశాత్తు నీటి సంపులో పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని నీటి సంపు నుంచి బయటకు తీసి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాలుడు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 

Similar News

News December 8, 2024

ఏం ముఖం పెట్టుకొని సంబరాలు చేస్తున్నారు?: డీకే అరుణ

image

హైదరాబాద్ సరూర్‌నగర్ నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొని ప్రసంగించారు. సీఎం రేవంత్ రెడ్డి ఏం ముఖం పెట్టుకొని సంబరాలు నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలు ప్రశ్నిస్తారని భయంతో రైతులను మభ్యపెట్టడానికి సోయి మరిచి సంబరాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

News December 7, 2024

MBNR: గ్రూప్ -4 సాధించిన కానిస్టేబుళ్లు.. అభినందించిన జిల్లా ఎస్పీ

image

మహబూబ్ నగర్ జిల్లాలో ఇటీవల విధులలో చేరిన 117మంది నూతన కానిస్టేబుల్స్ అభ్యర్థులలో 12 మంది అబ్బాయిలు, ఓ అమ్మాయి మొత్తం 13మంది గ్రూప్- 4 ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు సాధించిన వారిని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి అభినందించారు. వీరంతా భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆమె ఆకాంక్షించారు.

News December 7, 2024

MBNR: ఇన్‌ఛార్జ్ మంత్రి ఏడాది పాలన.. మీ కామెంట్

image

ఆందోల్ MLA రాజనర్సింహ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా ఏడాది. కాగా, ఆయనకు CM రేవంత్ వైద్య, ఆరోగ్యశాఖ కేటాయించడంతో పాటు MBNR ఇన్‌ఛార్జ్ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. అయితే ఇన్‌ఛార్జ్ మంత్రిగా MBNR‌లో అనేక అభివృద్ధి పనులు చేపట్టారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ వేదికగా ఫ్రీ బస్సు పథకం ప్రారంభం, రుణమాఫీ, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పనులు పూర్తిచేస్తున్నామన్నారు. మీ కామెంట్?