News February 1, 2025

NGKL: ‘నులిపురుగుల నిర్మూలన దినోత్సవం ఘనంగా నిర్వహించాలి’

image

ఫిబ్రవరి 10న జరిగే నూలి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహించేందుకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగిన నూలి పురుగుల నిర్మూలన దినోత్సవానికి సంబంధించిన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య అధికారి స్వరాజ్యలక్ష్మితో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News December 2, 2025

ఆదిలాబాద్: రూ.30 పెరిగిన పత్తి ధర

image

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్లో మంగళవారం సీసీఐ పత్తి ధర క్వింటా రూ.8,060గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,940గా నిర్ణయించారు. సోమవారం ధరతో పోలిస్తే మంగళవారం సీసీఐ ధరలో ఎటువంటి మార్పు లేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. ప్రైవేట్ ధర రూ. 30 పెరిగినట్లు వెల్లడించారు.

News December 2, 2025

నల్గొండ: పవన్ కళ్యాణ్ SORRY చెప్పాలి: కోమటిరెడ్డి

image

తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరిచేలా పవన్‌ కళ్యాణ్ మాట్లాడారని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. పవన్ ఉద్దేశపూర్వకంగా మాట్లాడారో, తెలియక మాట్లాడారో తనకు తెలియదన్నారు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే, తెలంగాణలో ఆయన సినిమాలు ఆడబోవని మంత్రి హెచ్చరించారు.

News December 2, 2025

చైనా మాంజాలపై నిర్మల్ పోలీసుల పంజా

image

జిల్లాలో చైనా మాంజా విక్రయాన్ని నిరోధించేందుకు జిల్లా పోలీస్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. పతంగులు ఎగరేసే సీజన్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే చైనా మాంజ వినియోగం, రవాణా, నిల్వ విక్రయాలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. కిరాణా దుకాణాలు, చిన్నపాటి వ్యాపార కేంద్రాలను సందర్శించి చైనా మాంజ విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.