News March 5, 2025

NGKL: నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

image

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:05 గంటల తర్వాత పరీక్ష కేంద్రంలోకి నో ఎంట్రీ. గంట ముందే సెంటర్ లోకి అనుమతి. 8:45 గంటలకు విద్యార్థులకు ఓఎంఆర్ షీట్ అందజేత జిల్లా వ్యాప్తంగా 33 పరీక్ష కేంద్రాల ఏర్పాటు నిఘా నేత్రంలో ఎగ్జామ్స్ సెంటర్స్ జిల్లాలో నేడు మొదటి సంవత్సరం పరీక్ష రాయనున్న 6,477 మంది విద్యార్థులకు ALL THE BEST.

Similar News

News February 27, 2026

మార్చిలో తిరుమలలో విశేష పర్వదినాలు

image

☞ మార్చి 2న శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల సమాప్తి ☞ 3న కుమారధార తీర్థ ముక్కోటి, చంద్ర గ్రహణం కారణంగా ఉ. 9 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయం మూత ☞ 19న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం ☞ 27న శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం ☞28న శ్రీరామ పట్టాభిషేక ఆస్థానం ☞30న తిరుమల శ్రీవారి వసంతోత్సవాలు ప్రారంభం.

News February 27, 2026

తూ.గో: టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. రేపే లాస్ట్!

image

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు-2026కు హాజరయ్యే విద్యార్థుల నామినల్ రోల్స్‌లో తప్పుల సవరణకు ప్రభుత్వం ప్రత్యేక అవకాశం కల్పించినట్లు DEO కె.వాసుదేవరావు తెలిపారు. విద్యార్థుల పేరు, పుట్టిన తేదీ, తదితర వివరాల్లో మార్పులు ఉంటే ఈనెల 28లోపు ఆన్‌లైన్‌లో సవరించుకోవాలని సూచించారు. ఇదేచివరి అవకాశమని, విద్యాసంస్థలు అప్రమత్తంగా ఉండి గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలని శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.

News February 27, 2026

జగిత్యాల: బడి పిల్లల కథా రచనలకు ఆహ్వానం: DEO

image

JGTL జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు కథా రచనలను ఆహ్వానిస్తున్నట్లు DEO రాము శుక్రవారం తెలిపారు. కథల్లో నైతిక విలువలు, మానవతా భావాలు, నీతినిజాయితీ వంటి అంశాలు ప్రతిఫలించాలన్నారు. పాఠశాల స్థాయిలోనే కథా రచన అలవాటు పెంపొందితే భవిష్యత్తులో మంచి రచయితలుగా ఎదుగుతారన్నారు. మార్చి15లోగా DEO కార్యాలయానికి పంపాలన్నారు. సుగుణాకర్, స్వామి పాల్గొన్నారు.